కోర్టును తప్పుదోవ పట్టిస్తున్న విపక్షాలు.

 

  • కోర్టును తప్పుదోవ పట్టిస్తున్న విపక్షాలు.
  • ఉన్నత న్యాయస్థానం ఇప్పుడు ఉన్నంతంగా ఉండాలి.
  • ఎవరో ఏదో అన్నారని.. అలా ఎందుకు చేయరని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా?.
  • వాస్తవ లెక్కలు చూపకపోవడం ఏంటి??.
  • ఏ రోజు బులిటెన్ ఆరోజు రిలీజ్ చేస్తోంది కదా?.

విపక్షాల మాటలు నమ్మి.. ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్న హైకోర్ట్ చాలా పెద్ద తప్పు చేస్తోంది. ప్రజల ముందు ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని కేంద్రం ఆడిస్తున్న ఆట ఇది. న్యాయ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని రాష్ట్రాలపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. అందుకే ఇటీవల కొత్త న్యాయమూర్తిని కేటాయించినట్లు తెలుస్తోంది. కేంద్ర ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారమే రాష్ట్రంలో టెస్టులు జరుపుతోంది వైద్య ఆరోగ్యశాఖ. కేవలం లక్షణాలున్న వారికే టెస్టులు జరపాలని.. మన దగ్గర కిట్లు తక్కువగా ఉన్నాయని కేంద్రమే ఆదేశాలు ఇచ్చింది. ఇదే రేపు కోర్ట్ లో సబ్ మిట్ చేస్తే తల ఎక్కడ పెట్టుకుంటారు.

పెద్ద సంఖ్యలో టెస్టులు చేయడం ద్వారా నష్టం తప్ప లాభం ఏమైనా ఉందా?. ఇతర రాష్ట్రాల్లో లక్షల టెస్టులు చేశారంటున్నారు. కానీ అక్కడ కేవలం వందల్లో మాత్రమే కేసులున్నాయి. లక్ష టెస్టులు చేస్తే అందులో వెయ్యి, 2వేల మందికి కూడా పాజిటివ్ రావడం లేదు. అటువంటప్పుడు.. 98వేల టెస్టులు వృధా కదా?. అందుకే ప్రభుత్వం ఎంతో జాగ్రత్తగా ముందుచూపుతో.. కేవలం కోవిడ్ 19లక్షణాలు కనిపించిన వారికే టెస్టులు చేస్తోంది. పాజిటివ్ వస్తే వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ అందిస్తూ పేషెంట్లు కోలుకునేలా చేస్తోంది. అందుకే దేశంలో కంటే తెలంగాణలో ఎక్కువగా రికవరీ పర్సంటేజ్ ఉంది.

గారడీ లెక్కలు చెప్పాల్సిన అవసరం, ప్రజల్ని మాయ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏంటి?. హైకోర్ట్ తన పరిధిని దాటి ప్రవర్తిస్తోంది. ప్రభుత్వ పనుల్లో జోక్యం చేసుకుంటోంది. కరోనా టెస్టులు, కేసుల వివరాలు దాయాల్సిన అవసరం లేదు. ఏరోజుకారోజు టెస్టులు జరుగుతున్నాయి. పాజిటివ్స్ సంఖ్య, మరణాలు, డిశ్చార్జ్ వివరాలను క్లియర్ గా చెప్తోంది ప్రభుత్వం. హైకోర్టే.. ప్రజల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. కరోనా వైరస్ రాష్ట్రంలో తగ్గుముఖం పట్టింది. వేల టెస్టులు చేయడం ద్వారా ఒరిగేది ఏమీ ఉండదు. అంత ఎక్విప్ మెంట్ కూడా కేంద్రం మనకు అందించలేదు. కేంద్రం సరిగ్గా వ్యవహరించకుండా.. మన మీద నిందలు వేస్తే ఎలా?.