యాంటిజెన్ టెస్ట్ లపై బోగస్ కథనాలు చేస్తున్న వెలుగు పత్రిక. 

 

  1. యాంటిజెన్ టెస్ట్ లపై బోగస్ కథనాలు చేస్తున్న వెలుగు పత్రిక. 
  2. కరోనా టెస్ట్ను పారదర్శకంగా చేస్తూ ఎప్పటికప్పుడు బులిటీన్ ప్రజల ముందు ఉంచుతున్న తెలంగాణ ప్రభుత్వం. 
  3. కరోనా వచ్చిన పేషెంట్లకు కంటికి రెప్పలా కాపాడుకుంటూ కిట్లను సైతం ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం.
మరోసారి వెలుగు పత్రిక తెలంగాణ ప్రభుత్వం పై విషం చిమ్మే కథనాలు చేస్తూ ఉంది,కరోనా టెస్టులను వేగవంతం చేయాలి మరియు ఎక్కువ సంఖ్యలో చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం పైన కూడా దిక్కుమాలిన కథనాలు చేస్తూ తన నైజాన్ని బయట పెట్టుకుంది. కరోనా మహమ్మారిని కట్టడి చేయాలన్న ఉద్దేశంతో పారదర్శకంగా పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం
ఎప్పటికప్పుడు బులెటిన్ రిలీజ్ చేస్తూ రోజూ ఎన్ని వేల టెస్టులు చేశాము? ఎంతమందికి పాజిటివ్ వచ్చింది? ఎంత పర్సెంట్ రికవరీ రేటు ఉన్నది అన్న విషయాలతో పాటు జిల్లాల వారీగా రిపోర్టులను ప్రజల ముందు ఉంచుతోంది.అంతేకాకుండా కరోనా వచ్చిన పేషంట్లను కంటికి రెప్పలా కాపాడుకోవాడానికి వాళ్లకు మనోధైర్యాన్ని నింపుతూనే వాళ్ళకి అన్ని వసతులతో కూడిన కరోనా కిట్లను సైతం తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న నిబద్ధతను ఎవరు కూడా ప్రశ్నించ లేరు.
పచ్చకామెర్లు ఉన్న వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అట అలా ఉంది వెలుగు పత్రిక నైజం.కరోనా మహమ్మారి విషయంలో వెలుగు పత్రిక ఎన్ని చీకటి కథనాలను చేసిన కూడా ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరు. నిన్నటికి నిన్న 15 వేల సంఖ్యలో కరోనా టెస్టులు చేస్తే కేవలం పన్నెండు వందల మంది మాత్రమే పాజిటివ్ గా తేలింది, అన్నిటికంటే సంతోష పడాల్సిన విషయం ఏంటంటే కేవలం నిన్న ఒక్క రోజే రెండు వేల మంది కరోనా మహమ్మారి నుంచి బయటపడడం జరిగింది. రికవరీ రేటు ఇంతలా ఉన్నా కూడా దీనిపై మాట్లాడడానికి మాత్రం వెలుగు పత్రిక మొహం చాటేస్తూ ఉంది.