హైదరాబాద్ పై విషం కక్కుతున్న v6 మీడియా…

 

  • హైదరాబాద్ పై విషం కక్కుతున్న v6 మీడియా…
  • క‌రోనాపై ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించేలా అసంబ‌ద్ధ కథనాలు…
  • y6 నిర్ల‌క్ష్య‌పు వైఖ‌రి పై ప్రజాగ్రహం…
  • తీరు మార్చుకోకుంటే భూస్థాపితం హెచ్చరికలు.

తెలంగాణ ప్రభుత్వం పై అక్కసుతో ఆ v6 మీడియా హౌస్ ప్రజల్లో మరింత భయాందోళనలు చేయించే విధంగా క‌రోనా వైర‌స్‌ పై దుష్ప్రచారం చేస్తోంది. తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్ నగరంలో వైరస్ వేగంగా విస్తరిస్తుంది అని అందరు హైదరాబాద్ ని వదిలిపెట్టి వెళ్లిపోతున్నారని అసత్య కథనాలను వండి వారిస్తోంది. ఇప్పటికే తమకు ప్రభుత్వం ప్ర‌క‌ట‌న‌లను ఇవ్వడం లేదని, అనవసరంగా రాద్ధాంతం చేస్తున్న v6 ఇలా ఆ ప్రభుత్వాన్ని అప్ర‌తిష్ట పాలు చేసే విధంగా కావాలని పనిగట్టుకుని వ్యవహరిస్తోంది.

నిజానికి v6 ఛానల్ అధినేత మాజీ ఎంపీ వివేకానందకు ఎంపీ సీటు నిరాకరించడంతో ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై అసూయ ద్వేషాల‌తో యుద్ధం ప్ర‌క‌టించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాన్ని ఎప్పుడు బ‌ద్నాం చేసే విధంగా కావాలని ఇలాంటి పిచ్చి పిచ్చి కథనాలను వండి వారించి, తమ పైశాచికత్వాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నాడు. ఇప్పటికే వి6 వ్యవహారశైలిపై అందరిలోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది.
తమ స్వార్ధం కోసం తెలంగాణా ప్రజల్లో భయాందోళనలు నింపి తద్వారా అందరికీ ఆందోళ‌న‌, భ‌యం, కలిగించే విధంగా ఈ మీడియా హౌస్ ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమని అందరూ తిట్టిపోస్తున్నారు. తమ స్వప్రయోజనాలే పరమావధిగా భావిస్తూ వీ6 వైఖ‌రిని సామాన్య ప్రజలంతా ఛీ కొడుతున్నారు. బాధ్యతాయుతమైన మీడియాను నడిపిస్తున్నమాజీ ఎంపీ వివేక్ నీకు దమ్ముంటే ప్రజలకు సేవ చేసే విధంగా ప్రవర్తించు. అంతేగాని అనవసరమైన దుష్ప్ర‌చారానికి దిగితే నీకు పుట్టగతులుండవు. ఇప్పటికైనా నీ తీరు మార్చుకో. లేకపోతే నీ రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోయిందని తెలుసుకో. త్వరలోనే నీ మీడియా కూడా ప్రజాగ్రహానికి గురై,  నీ రాజ‌కీయ భ‌విష్య‌త్తు లాగానే రూపు కోల్పోతుందని తెలుసుకో. తస్మాత్ జాగ్రత్త.