ఉత్త‌మ్‌.. రైతుల పొట్ట‌కొట్ట‌కు!

 

  • ఉత్త‌మ్‌.. రైతుల పొట్ట‌కొట్ట‌కు!
  • పిచ్చి స్టేట్‌మెంట్ల‌తో వాళ్ల‌ను ఆగం జేయ‌కు
  • నియంత్రిత వ్య‌వ‌సాయ విధానంతో ఎంతో మేలు

రైతులు ఏం పంట‌లు పండించాలో ప్ర‌భుత్వం చెప్ప‌కూడ‌ద‌ట! కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేసిన‌ట్టు.. రైతులూ… మీ చావు చావండంటూ వ‌దిలేయాల‌ట‌!! పీసీసీ బాసు ఉత్త కుమార్ రెడ్డి ప్ర‌భుత్వానికి ఇచ్చిన అత్యుత్త‌మ‌ స‌ల‌హాలు ఇవి. పంట‌మార్చాల‌ని రైతుల‌కు సూచిస్తే కాంగ్రెస్ ఊర్కోద‌ట‌! దీన‌ర్థం రైతులు పాత ప‌ద్ధ‌తిలో పంట‌లు పండించి ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవాల‌ని కాంగ్రెస్ కోరుకుంటోంది. వాళ్ల నాశ‌నాన్ని చూడాల‌ని అనుకుంటున్న‌ది. అన్న‌దాత‌లు బాగుప‌డ‌టం, ప్ర‌భుత్వానికి మంచి పేరు రావ‌డం.. ఉత్త కుమార్ రెడ్డికి ఇష్టం లేదు.

అందుకే ఇలాంటి గ‌లీజ్ మాట‌లు మాట్లాడుతున్నడు. ప్ర‌పంచంలో ఇలాంటి ప్ర‌తిప‌క్షం ఎక్క‌డైనా ఉంటుందా ? అస‌లు నియంత్రిత వ్య‌వ‌సాయ విధానం గురించి క‌నీస అవ‌గాహ‌న లేకుండా, పంట‌ల విధానం గురించి తెలియ‌కుండా మాట్లాడుతున్న ఈ వ్య‌క్తిని ఏమ‌నాలి ? కాంగ్రెస్ ప్ర‌భుత్వాలు క‌ల‌లోనూ రైతుల‌కు మేలు చేయ‌వు. వేరే వాళ్లు చేసినా వీళ్లు ఊర్కోవ‌డం లేదు. వీళ్లు సంఘ‌వ్య‌తిరేక శ‌క్తులుగా మారారు. వర్షాకాలంలో ఏ పంటలు వేయాలి, వేటికి డిమాండ్‌ ఉందనే అంశంపై ప్రభుత్వం అధ్యయనం చేసింది. వర్షాకాలంలో మొక్కజొన్న సాగు చేసినా పక్క రాష్ట్రాలు తక్కువ ధరకే ఇస్తుండటంతో మన మక్కలను కొనుగోలు చేసేవారే లేరు. రాష్ట్రంలో కేవలం 25 లక్షల టన్నుల మక్కల వినియోగం మాత్రమే ఉంది.

మొక్కజొన్నకు బదులుగా 15 లక్షల ఎకరాల్లో కంది సాగు చేస్తే అంతా ప్రభుత్వమే కొంటుంది. దీనివల్ల రైతుకు బాధ ఉండదు. అంతర్జాతీయ మార్కెట్‌లో 6.33 మి.మీ కంటే ఎక్కువ పొడవున్న బియ్యానికి డిమాండ్‌ ఉన్నట్లు స్టడీలో తేలింది. తెలంగాణ వ్యవసాయ శాస్త్రవేత్తలు సృష్టించిన ‘తెలంగాణ సోనా’వెరైటీలో షుగర్‌ కంటెంట్‌ తక్కువగా ఉందని తేలింది. అందుకే ఈ వంగడాన్ని పండించాలని ప్రభుత్వం చెబుతోంది. వరితో పోలిస్తే పత్తి పండించిన రైతు రెట్టింపు ఆదాయం సంపాదించవచ్చు.

వరిలోనూ కొన్ని వంగడాలను ఎంచుకుంటే ఆదాయం పెరుగుతుంది. దేశంలో ది బెస్ట్‌ కాటన్‌ తెలంగాణతోపాటు కేవలం విదర్భలో మాత్రమే పండుతుంది. ఈసారి రాష్ట్రంలో 70 లక్షల ఎకరాల్లో పత్తి పండించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పింది ఇందుకే. వానకాలంలో మొక్కజొన్న వేస్తే ఫాయిదా ఉండదు. బదులుగా కంది గానీ పత్తి గానీ వేసినోళ్లకు పైసల పంట పండుతుంది. నియంత్రిత వ్యవసాయ విధానంతో ఇన్ని లాభాలు ఉంటే ఉత్తమ్ మాత్రం ఈ పద్ధతి వద్దంటున్నడు. ఇతడు రైతు వ్యతిరేకి కాకుంటే ఏమవుతాడు ? ఇలాంటి స‌న్నాసుల‌ను మాట‌ల‌ను అన్న‌దాత‌లు ప‌ట్టించుకోకూడ‌దు.