* ఉత్తంకుమార్.. మీ హయాంలో ప్రాజెక్టులే కొట్టుకుపోయాయి కదా.
* దేవాదుల లో పైపులైన్లు పటాకుల్లాగా ఎగిరిపోయాయి.
* ఎన్నో ప్రాజెక్టులకు గండి పడి ప్రజలంతా పడ్డ అవస్థ సంగతి మర్చిపోయావా.
* ఏదైనా మాట్లాడే ముందు కాస్త చరిత్ర తెలుసుకుని మాట్లాడు.
ఉత్తంకుమార్ రెడ్డి లాంటి మతిలేని వ్యక్తి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉండడం వల్లనే కాంగ్రెస్ పార్టీ సంకనాకి పోయింది. తాజాగా కొండపోచమ్మ సాగర్ పై ఏర్పడిన బుంగాను పరిశీలిస్తూ ఆయన అన్న మాటలు ఆయన అవివేకానికి నిదర్శనం. ప్రపంచంలోనే ఉత్కృష్టమైన కాలేశ్వరం ప్రాజెక్టు పై కాంగ్రెస్ నేతలకు ఏడుపు ఎప్పటినుంచో ఉంది. తాజాగా కొండపోచమ్మ సాగర్ పై కాలువపై ట్రయల్ రన్ నిర్వహించినప్పుడు బుంగ పడింది. దానికి కాంగ్రెస్ నాయకులు నానా రాద్ధాంతం చేస్తున్నారు.
మిస్టర్ ఉత్తమ్ ఆ ప్రజలంతా చరిత్రను మర్చిపోలేదు. మీ హయాంలో కాలువకు గండ్లు పడ్డాయి కాదా. పైపులైన్లు పటాకుల్లాగా ఎగిరిపోయాయి. ఖమ్మం జిల్లాలోనే పాలెంవాగు ప్రాజెక్ట్ అయితే రెండు సార్లు కొట్టుకుపోయింది. చరిత్రను మరచిన మీరు చేస్తున్న మాటలు ఎవరూ మరిచిపోలేదు. ఒక్కసారి మాటలు మాట్లాడే ముందు నీ చరిత్రను తిరిగి చూసుకో. ఆరు వందల మీటర్లకు పైగా ఎత్తుకు జలాలను తరలించిన ప్రాజెక్టు ప్రపంచంలోనే కాలేశ్వరం ఒకటి మాత్రమే. ఈ ప్రాజెక్టు సూపర్ సక్సెస్ కావడం పై కాంగ్రెస్ నేతలు ఎప్పటినుంచో ఏడుస్తున్నారు.
సాక్షాత్తు కాలేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ఇలాంటి బుంగలు పడడం సాధారణమైనది చెప్పుకున్నా కూడా కాంగ్రెస్ నేతల కళ్ల మంటలు చల్లారడం లేదు. ఇలాంటి భారీ ప్రాజెక్టులు ఏర్పాటు చేసినప్పుడు చిన్నచిన్న సంఘటన జరగడం సాధారణమే. దీనివల్ల పలు చేస్తూ కాంగ్రెస్ నేతలు ఆ మంటలో తామే. చలి కాచుకుంటం అని భావిస్తే ఆ మంటల్లోనే వారంతా తగలబడి పోతరు అని తెలుసుకోండి. అసలు జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చినది కాంగ్రెస్ పార్టీ నేతలు అని చరిత్ర చెబుతోంది.
ఇలాంటి నీతిమాలిన లుచ్చా పనులు చేసారు కాబట్టి ప్రజల మిమ్మల్ని తన్ని తగలేసే ప్రతిపక్షంలో వరుసగా రెండుసార్లు కూచోబెట్టారు. ఇప్పటికైనా కాస్త బుద్ధి తెచ్చుకొని బాద్యతగా మాట్లాడండి. లేకపోతే నిన్ను హుజూర్నగర్లో చేసినట్లుగానే పంగనామాలు మీ పార్టీకి పెడతారు. గోదావరి జిల్లాలో తమ ప్రాంతానికి వచ్చి ప్రజలంతా ఆనంద భాష్పాలు కారుస్తూ ఉంటే కాంగ్రెస్ నేతలు మాత్రం మొసలికన్నీరు కారుస్తూ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలాగే ఉంటే ఏదో ఒక రోజు ప్రజాగ్రహానికి గుకాకతప్పదని తెలుసు కోవాలి తస్మాత్ జాగ్రత్త.