అసత్యాలను ప్రచురిస్తూ పబ్బం గడుపుకోవడం తప్ప మీకేం వచ్చు కాంగ్రెస్ పార్టీ కుహనా మేధావుల్లారా. 

  • అసత్యాలను ప్రచురిస్తూ పబ్బం గడుపుకోవడం తప్ప మీకేం వచ్చు కాంగ్రెస్ పార్టీ కుహనా మేధావుల్లారా. 
  • కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా శవాల మీద చిల్లర ఏరుకునే రాజకీయాలు ఏంటి. 
  • ఐసిఎంఆర్ నింబంధనల ను పాటిస్తూ తెలంగాణ కరోనా టెస్ట్లు చేస్తోందన్న విషయం మీ మెదళ్లకు ఎక్కడం లేదా?? 
అసత్యాలను ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకోవడం కాంగ్రెస్ పార్టీకి అలవాటైపోయింది. భవిష్యత్ అంతా చీకటిగా కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలకు ఏం చేయాలో తోచక గతిలేని విమర్శలు చేస్తున్నారు.చివరికి ఎంతలా దిగజారారు అంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి బారిన పడి కొట్టుమిట్టాడుతుంటే ఇటువంటి సమయంలో కూడా సిగ్గులేని రాజకీయాలకు తెరతీశారు.తెలంగాణ రాష్ట్రం సరైన కరోనా టెస్టులు చేయడం లేదు అని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న వీళ్ళ మెదళ్ళకు ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారమే తెలంగాణ రాష్ట్రం పరీక్షలు నిర్వహిస్తుంది అని తెలియదా.
ఎదుటి వారిని విమర్శించే ముందు కనీసం కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్న కాంగ్రెస్ దద్దమ్మల మాటలు ప్రజలు అసలు పట్టించుకునే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పట్టడంతో ఇరకాటంలో పడ్డ ప్రతిపక్షాలు ఏమి చేయాలో తెలియక ఇలా అతి గతి లేని మాటలు మాట్లాడుతున్నారు. ఇలా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ శవాల మీద పేలాలు ఏరుకునేలా మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అత్యంత అవకాశవాద రాజకీయ నాయకులు