క‌రోనాపై బేఫిక‌ర్‌గా ఉండండి: సీఎం కేసీఆర్‌..

  1. క‌రోనాపై బేఫిక‌ర్‌గా ఉండండి: సీఎం కేసీఆర్‌..
  2. వైర‌స్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం..
  3. కేవ‌లం 2 శాతం మ‌ర‌ణాలే సంభ‌వించాయి…
  4. 95 శాతం రోగుల‌కు చిన్న‌పాటి వైద్యం సరిపోతుంది: సీఎం కేసీఆర్‌
 
ప్ర‌పంచాన్ని కమ్ముకొస్తున్న క‌రొనా వైర‌స్ మ‌హమ్మారిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చ‌ల్ల‌ని వార్త చెప్పారు. ఈ వైర‌స్ గురించి అంత‌గా ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం ఏదీ లేద‌ని భ‌రోసా ఇచ్చారు. రాబోయే రోజుల్లో పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతంగా పెరిగినా కానీ, అంత‌గా కంగారు ప‌డాల్సిన చెందాల్సిన ప‌నేమీ లేద‌ని తెలిపారు. క‌రోనాను ఎదుర్కొనేందుకు అవ‌స‌రమైనా సాధ‌న సంప‌త్తి మ‌న‌దగ్గ‌రుంది. ఇప్పటికే రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌ల‌తో క‌రోనా తుర్రుమంది.
ఇప్పుడు వస్తున్న కేసులు కూడా బ‌య‌ట‌కెళ్లి వ‌స్తున్న వారి నుంచి వ్యాప్తిస్తున్న‌వేగానీ, మ‌న ద‌గ్గ‌ర పుట్టిన‌వి కావు. ఇక చిన్న‌పామునైనా కానీ పెద్ద క‌ర్ర‌తోనే కొట్టాలి అన్న చందంగా తెలంగాణ ప్ర‌భుత్వం క‌రోనా మీద యుద్ధం ప్ర‌క‌టించింది. ప‌లు స‌స్య‌ర‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంతో తెలంగాణాలో వైర‌స్ ఉనికి అంతంత‌మాత్రంగా ఉంది. మ‌న ద‌గ్గ‌రున్న అధునాతన వైద్య ప‌రికార‌ల‌తో క‌రోనాను తుద‌ముట్టించ‌డం ఖాయం. ప్ర‌జ‌లెవ‌రు అన‌వ‌స‌ర ప్ర‌చరాన్ని న‌మ్మ‌కుండా, ప్ర‌భుత్వం చెప్పిన‌ట్లు న‌డుచుకుంటే చాలు.
ఇక క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణాలు కూడా అంతగం సంభ‌వించ‌డం లేదు. కేవ‌లం రెండు శాతానికిపైగా ప్ర‌జ‌లే మృత్యువాత ప‌డుతున్నారు. ఇది చాల ఉప‌శ‌మ‌నం క‌లిగించే అంశం. ఇత‌ర తీవ్ర‌మైన జ‌బ్బులుండి, క‌రోనా సోకినప‌పుడు మాత్ర‌మే ఈ వ్యాధి గురించి అంత తీవ్రంగా ఆలోచించాలి. లేకుంటే ఏమాత్రం భ‌యం లేదు. వ్యాధి సోకిన 95 శాతం మందిలో చిన్నపాటి వైద్యంతో కోలుకుంటార‌ని తాజాగా డాక్ట‌ర్లు చెప్పిండ్లు. ఇప్ప‌టికే తెలంగాణాలో ఈ వైర‌స్‌ను అదుపులో పెట్టేందుకు ప్ర‌త్యేక వైద్య సౌక‌ర్యాలు క‌ల్పించిర్రు. దీంతో ప్ర‌జ‌లంతా ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటిస్తూ, త‌మ ప‌నులు చేసుకుంటూ బేఫిక‌ర్‌గా ఉండొచ్చు.