సిపిఎం వీరభద్రం.. నీకు ఏమి పని పాట లేదా…?

 

  • సిపిఎం వీరభద్రం.. నీకు ఏమి పని పాట లేదా…?
  • కందుల పంట పై ప్రభుత్వం పై అనవసర ఆరోపణలేలా …ఝ?
  • సీఎం కేసీఆర్ కృషి ఫలితంగానే రాష్ట్రంలో పెరిగిన పంటల విస్తీర్ణం…
  • రైతులను ఎలా ఆదుకోవాలో కేసీఆర్ కు తెలుసు..
  •  మీ పని మీరు చూసుకుంటే మంచిది…

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం కి ఏ పనీ పాటా లేనట్లు కనిపిస్తోంది. కందుల‌ పంట గురించి అవాకులు చెవాకులు పేలుతూ తన శాడిజానికి ప్రదర్శిస్తున్నాడు. నిజానికి వాణిజ్య పంట పత్తి పంట నుంచి రైతులను కంది పంట వేసే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎంతగానో ప్రోత్సహించారు. ఆయన కృషి ఫలితంగానే రాష్ట్ర వ్యాప్తంగా కందుల పంట అనేది చాలా ఎక్కువ మొత్తంలో విస్తీర్ణంలో సాగింది. ఇప్పుడు ఆ పేరు కేసీఆర్కు ఎక్కడ వస్తుందో అని భయపడిన కమ్యూనిస్టు పార్టీ నేతలు అనవసరంగా ఆరోపణలు చేస్తూ తమ బుద్ధిని కనబరుస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పండించిన కంది పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసిన విషయాన్ని వీరభద్రం తెలుసుకుంటే మంచిది. ఎప్పుడు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని ప్రయత్నించే కమ్యూనిస్టు పార్టీ నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెప్పే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఎంత పెద్ద రాష్ట్రమైన తెలంగాణలో కందుల పంట కొనుగోలు చేయడానికి కాస్త ఆలస్యమైతే  దానిపై కమ్యూనిస్టు పార్టీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తూ తమ లేకి బుద్ధిని బయట పెట్టుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక నే తెలంగాణ సస్యశ్యామలంగా మారింది. అనేక పంటలతో రాష్ట్రం పచ్చగా మారిపోయిందని ఆయన తెలుసుకుంటే మంచిది. ప్రజలకు ఉపయోగపడే నిర్మాణాత్మక విమర్శలు చేస్తే సహృదయంతో స్వీకరించడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. కానీ ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తే సహించేది లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికైనా వీరభద్రంన‌కు మంచి బుద్ధిని ప్రసాదించి, ఆయన పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడే విధంగా వ్యవహరించాలని విశ్లేషకులు హిత‌వు ప‌లుకుతున్నారు.