క‌రోనాపై బాధ్యతగా వ్యవహరించండి.. మీడియాకు ప్ర‌జ‌ల హుకుం…

 

  • క‌రోనాపై బాధ్యతగా వ్యవహరించండి.. మీడియాకు ప్ర‌జ‌ల హుకుం…
  • ఒక‌ట్రెండు మరణాలపై రాద్ధాంతం సరికాదని హితవు…
  • మీడియా ప్రజల్లో భరోసా నింపాలి…

అనవసర ఆందోళనను రేకెత్తించే విధంగా కథనాలు రాయకూడదు…

క‌రోనా వైరస్ కారణంగా తాజాగా ఒకరిద్దరు మరణించడం పై సీమాంధ్ర, తెలంగాణ ద్రోహ‌ మీడియా గగ్గోలు పెట్టడం పై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. గత మార్చిలో వైరస్ ఉనికిలోకి వచ్చాక తెలంగాణ ప్రభుత్వం ఎంత సమర్థంగా వ్యవహరించిందో అంద‌రికి తెలుసు. ఆగమేఘాలపై అత్యవసర సౌకర్యాలను కల్పించడంతోపాటు కరుణ వైరస్ ను అరికట్టడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంది. వైర‌స్‌పై యుద్ధం చేస్తున్న ఫ్రంట్ వారియ‌ర్స‌ అయినా పోలీసులు, వైద్య సిబ్బంది నైతిక స్థైర్యం దెబ్బతినేలా మీడియా ఇలా కథనాలు వండి వార్చడం పై తెలంగాణ వాసులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

క‌రోనా బాధితులందరికీ తగిన సాయం చేయడానికి అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉన్నాయని,  కింగ్‌కోఠిలో హాస్పిటల్ కూడా ఏర్పాటు చేశ‌ర‌ని గుర్తు చేస్తున్నారు. క‌రోనా బాధితులు అందరికీ టెస్టులు చేస్తున్నార‌ని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. క‌రోనా సంక్షోభం వేళ భరోసా ఇచ్చే విధంగా మీడియా కథనాలు ఉండాలని, అనవసర భయాందోళనలకు గురి చేసే విధంగా ఉండకూడదు అని హితవు పలికారు.

నిజానికి క‌రోనా వైరస్ ను అడ్డుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేసిన సంగతి తెలిసిందే. కరోనా పై పోరాటం చేసిన ముఖ్యమంత్రులపై నిర్వ‌హించిన స‌ర్వేలో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి దేశంలోనే తొలి స్థానం వ‌చ్చిన  సంగతి అందరికీ విదితమే. ఇలా మీడియా బాధ్యత లేకుండా కథనాలను వండి వారిస్తూ కరోనా పై ప్రజల్లో మరింతగా ఆందోళ‌న‌కు గురిచేసే విధంగా ప్రవర్తించకూడదు. ఇక నిన్న వైరల్ అయిన క‌రోనా రోగి మృతి వీడియో గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

క‌రోనావైరస్ కు గురైన యువకుల్లో కొందరిలో అకస్మాత్తుగా గుండెపోటు కూడా ఆగిపోతుందని బ‌య‌ట‌కొచ్చింది.  అలాగే ఆక్సిజన్ సప్లై గురించి మాట్లాడుతున్న విషయాలు కూడా కాస్త సందేహాస్ప‌దంగా ఉన్నాయి. ఈ వీడియోలోని వ్యక్తి ముక్కుకు ఆక్సిజన్ సప్లై ఉన్నందువల్ల అతను మాట్లాడే విషయంలో కొంత స్పష్టత లేదు. సమాజానికి నాలుగో స్థంబంలా నిలిచే మీడియా తగిన చిత్తశుద్ధితో వ్యవహరించాలి. లేక‌పోతే త్వ‌ర‌లోనే తెర‌మ‌రుగుకాక త‌ప్ప‌దు.