నీవల్ల తెలంగాణకు రూపాయి లాభం లేదు విజయశాంతి

 

  • ముందు నీపై ప్రజలు తిరగబడకుండా చూసుకో విజయశాంతి
  • నీవల్ల తెలంగాణకు రూపాయి లాభం లేదు విజయశాంతి
  • ప్రజలు నిన్ను తరిమేస్తేనే పోయి ఎక్కడో పడ్డావు
  • ప్రజలు నిన్న మళ్లీ తెలంగాణలో అడుగుపెట్టనివ్వరు జాగ్రత్త
  • నోరును అదుపులో పెట్టుకో

విజయశాంతి.. నువ్వు నీ నోరును అదుపులో పెట్టుకో. ఇదేమీ సినిమా కాదు. నువ్వేమీ తెలంగాణకు హీరోయిన్ వి కాదు. సినిమాలో నటన, నిజ జీవితం ఎప్పటికీ ఒక్కటి కాదు విజయశాంతి. కాబట్ట.. నువ్వు ముందు నీ నోటిని అదుపులో పెట్టుకో. ఎవరిపై ప్రజలు తిరగబడతారు.. ఎవరిపై తిరగబడ్డారు అనే విషయం అనేది అందరికీ తెలుసు. నిన్ను తెలంగాణ ప్రజలు ఎక్కడ ఉంచారో కూడా తెలుసు. ఎలా తన్ని తరిమేశారో కూడా దేశానికి తెలుసు. అవన్నీ కాదు కానీ.. అసలు నీవల్ల తెలంగాణకు వచ్చిన ఫైదా ఏంటో చెప్పు విజయశాంతి. తెలంగాణకు నీవల్ల రూపాయి లాభం లేదు.

అభివృద్ధిలో ఎక్కడో అట్టడుగున ఉన్న తెలంగాణను సీఎం కేసీఆర్ పైకి తీసుకొచ్చి తెలంగాణకు ఒక రూపం ఇస్తుంటే మీకు ఉండబట్టడం లేదా? వలస పాలకుల వల్ల తెలంగాణకు ఇంత దరిద్రం పట్టింది. ఇప్పుడిప్పుడే తెలంగాణ గాడిలో పడుతోంది. ఇవన్నీ మీకు కనిపించవు. కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోంది. మిగితా రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ చాలా బెటర్. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ… కరోనా తగ్గి డిశ్చార్జ్ అయ్యేవాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

కరోనా విషయంలో ప్రభుత్వం చేతులెత్తేయలేదు. ప్రభుత్వం ఇప్పుడే కాదు.. ఎప్పుడూ చేతులెత్తేయదు విజయశాంతి. సినిమాల్లో ఆఫర్లు తగ్గగానే చేతులెత్తేసి… రాజకీయాలు అంటూ రంగులు మార్చింది నువ్వు విజయశాంతి. సీఎం కేసీఆర్ కరోనా కట్టడిపై చాలా సీరియస్ గా ఉన్నారు. ప్రభుత్వ యంత్రాంగం క్షణక్షణం అప్రమత్తంగా ఉంటూ… కరోనాపై పోరు చేస్తోంది. అవన్నీ నీకు తెలియక.. ఏదో సొల్లు వాగుడు వాగుతున్నావు. ఇంకా ఇలాగే మాట్లాడితే నిన్ను తెలంగాణ ప్రజలు ఏదో ఓరోజు తెలంగాణ నుంచే తరిమేస్తరు జాగ్రత్త.