ఉనికి చాటుకునేందుకు టీటిడిపి యత్నాలు…

 

  • ఉనికి చాటుకునేందుకు టీటిడిపి యత్నాలు…
  • ఈ నేపథ్యంలోనే గవర్నర్ను కలిసి వినతిపత్రం అందజేత…
  • పార్టీలో నాయకుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది…
  • తెలంగాణలో దాదాపు ఆ పార్టీ చ‌చ్చిపోయిందంటున్న‌ విశ్లేషకులు…

తెలంగాణలో తెలుగుదేశం పార్టీని చూస్తుంటే జాలి వేస్తుంది. నిన్న తెలంగాణ ప్రభుత్వం పై ఫిర్యాదు చేసేందుకు గవర్నర్ వ‌ద్ద‌కు  వెళ్ళిన తెలుగుదేశం పార్టీ నేతల్లో కనీస స్థాయిలో నాయకులు కనిపించలేదు. ఒకరిద్దరు మినహా మిగతా వారంతా కొత్తవారే ఈ క్రమంలో రాష్ట్రంలో టిడిపి పార్టీ అంతరించి పోయిందని చెప్పడానికి ఇదే ఉదాహరణ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏదో తాము తెలంగాణ లో ఉన్నందుకు ఉనికిని చాటుకోవడం లో భాగంగానే గవర్నర్కు కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదులో ఎలాంటి పస లేనట్లు స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా నేరాల నివారణలో తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉందని, అక్కడక్కడా ఒకటి రెండు ఘటనలు జరిగితే దాని పై గవర్నర్ కు ఫిర్యాదు చేయడం వల్ల అవివేకానికి నిదర్శనం అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

గతంలో తమ అధినేత చంద్రబాబు నాయుడు హయాంలో ఆంధ్రప్రదేశ్ లో అనేక ఘటనలు జరిగిన విషయాన్ని పేర్కొంటున్నారు. ఎమ్మార్వో వనజాక్షి పై దాడి, కాల్ మనీ రాకెట్ ఇలాంటి ఎన్నో సిగ్గుచేటు ఘటనలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా తెలంగాణ తెలుగుదేశం పార్టీని ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరని కేవలం తమ ఉనికిని చాటుకోవడం కోసం ఇలాంటి రాజ‌కీయ జిమ్మిక్కుల‌కు దిగినట్లు తెలుస్తోంది. తెలంగాణకు అడుగడుగున ద్రోహం చేసిన తెలుగుదేశం పార్టీని బొంద పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆ పార్టీ తరఫున ఉంటే రాజకీయ భవిష్యత్తు లేదని నాయకులు కొందరైనా తెలుసుకుంటే మంచిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.