సెక్రటేరియట్​ను సీక్రెట్​గా కూల్చేశారా! ఇదేం వాదన రేవంత్​.. చిప్​ దొబ్బందా ?

 

 

  • సెక్రటేరియట్​ను సీక్రెట్​గా కూల్చేశారా!
  • ఇదేం వాదన రేవంత్​.. చిప్​ దొబ్బందా ?

సాక్షాత్తూ రాష్ట్ర హైకోర్టు అనుమతి తీసుకొని సెక్రటేరియట్​ను కూల్చేశారు. ఈ విషయం పత్రికల్లో పేపర్లలో టీవీల్లో వచ్చింది. జనం అంతా చూశారు. రేవంత్​ రెడ్డికి మాత్రం ఈ విషయమే తెలియదట! తనకు తెలియకుండానే కూల్చివేతలు జరిగాయని బాధపడుతున్నడు. గుప్తనిధుల కోసమే సెక్రటేరియట్​ను రహస్యంగా కూల్చారట! పాపం మనోడు..ఒక ఫుల్​ బాటిల్ కొట్టి ఉంటడు. అందుకే విషయం తెలియదలేదు కావొచ్చు. లేకపోతే మత్తులో మాట్లాడుతున్నాడేమో అర్థం కావడం లేదు.

ఈమధ్య రేవంత్​ తలాతోక లేకుండా ప్రతి అంశంపై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు. సెక్రటేరియట్​ కింద గుప్త నిధుల ఉండటం ఏంటో! వాటిని సీఎం కేసీఆర్​ తీసుకున్నాడని అనడం ఏంటో తెలియక కాంగ్రెసోళ్లే తలలు పట్టుకుంటున్నారు. అలాంటి నిధులే ఉంటే సెక్రటేరియట్​ నిర్మించినప్పుడే దొరికేవి కదా! కొత్తగా ఎవరైనా గుప్త నిధులు తెచ్చి దాస్తారా ? మాట్లాడితే అర్థంపర్థం ఉండాలి. అబద్ధాలు చెప్పినా వినుబుద్ధి కావాలి. రేవంత్​ మరీ చిన్న పిల్లాడిలా, గల్లీ లీడర్​లా మాట్లాడుతున్నాడు.

కాంగ్రెస్​ పరువును గంగలో కలుపుతున్నాడు.   కనీసం ఒక్క ఆధారమో, సాక్ష్యమో చూపకుండా, బట్టకాల్చి మీదేసినట్టు మాట్లాడాడు. కేసీఆర్​ కుటుంబాన్ని బద్​నాం చేయడానికే ఇలా పిచ్చిపిచ్చిగా వాగాడని అర్థమవుతున్నది. ఎందుకంటే సెక్రటేరియట్​మరీ పురాతన భవనం ఏమీ కాదు. దాని కింద గుప్త నిధులు ఎలా ఉంటాయి ?  ఇది గుడీకాదు. రాజకోట కాదు. దాని కింద రాళ్లు, రప్పలు తప్ప ఏమీ ఉండవు. అంతేకాదు గతంలో ఇలాంటి ఆరోపణలు రావడంతో పురావస్తుశాఖ వాళ్లు ఈ ప్రాంతంలో చాలా పరిశోధనలు చేశారు. కనీసం ఈసమెత్తు బంగారం దొరకలేదు. ఈ ఏరియాలో గుప్తనిధులకు అవకాశమే లేదని వాళ్లే చెప్పారు. కూల్చివేతలు రహస్యంగా జరగాయన్న రేవంత్​ విమర్శలు పచ్చిఅబద్ధాలు. కాంగ్రెస్​ను నాశనం చేయడానికి వేరే ఇతర పార్టీల నాయకుల అవసరమే లేదు. రేవంత్ ఒక్కడు చాలు ఆ పని చేయడానికి!