వడ్లు 80శాతానికి పైగా కొన్నది సర్కార్.

 

  • వడ్లు 80శాతానికి పైగా కొన్నది సర్కార్.
  • వడ్ల కొనుగోళ్లు సగం కూడా కొనలేదనడం తప్పు.
  • కేవలం 20శాతం లోపే కొనుగోళ్లు ఆగాయి.
  • రాష్ట్రంలో 80శాతానికి పంట కొనుగోళ్లు పూర్తి చేసింది ప్రభుత్వం.
  • రైతుల ఖాతాల్లో డబ్బులు కూడా వేసింది.

చమురు లేని వెలుగు.. సన్నాసి రాతలు రాస్తోంది. నిత్యం ప్రభుత్వం మీద పడి  ఏడ్వటం తప్ప.. వెలుగు పత్రికకి మరో పని లేదు. నెలన్నర అవుతున్నా.. ధాన్యం కొనుగోళ్లు ప్రభుత్వం సగం కూడా కొనలేదట. రోడ్ల మీద వడ్లు రోడ్ల మీదనే ఉన్నాయట. ఎక్కడో ఒకటి అర మిగిలిపోయి ఉండొచ్చు. కానీ.. రాష్ట్రంలో 80శాతం వడ్ల కొనుగోళ్లను సర్కార్ పూర్తి చేసింది. వ్యవసాయ శాఖ దగ్గరకు వస్తే.. ఎన్ని కొనుగోళ్లు జరిపింది అన్నీ వివరిస్తాం. వచ్చి చర్చించే దమ్ముందా?. అసలు ఏ ప్రాతిపదికన.. సగం కూడా కొనలేదని పిచ్చి రాతలు రాస్తున్నారు.

వడ్ల కొనుగోళ్లు ప్రభుత్వం 80శాతానికి పైగా కొనుగోళ్లు జరిపి.. వారి ఖాతాల్లో డబ్బులు కూడా వేసింది. ఏ మారుమూల పల్లెకు వెళ్లి అడిగినా ఈ విషయం చెప్తారు. హైదరాబాద్ లో కూర్చొని.. మీకు మీరు ఊహించుకుంటూ సగం కూడా కొనలేదని.. ఇంటర్నెట్ లో ఫోటోలు తీసి వార్తలు రాయడం కాదు. వాస్తవ పరిస్థితి ఏంటనేది క్షేత్రస్థాయిలో తిరిగితే తెలుస్తుంది. ప్రభుత్వ లెక్కలు చూస్తే తెలుస్తుంది. ఎక్కడో ఒకటి అర చోట్ల మిగిలిన వాటిని చూపిస్తూ అసలు సగం కూడా కొనలేదు అనడం దుర్మార్గం. రైతుల్ని ప్రభుత్వం కడుపున పెట్టుకు చూసుకుంటోంది.

ప్రభుత్వం అందించిన నీరు, కరెంటుతోనే కదా.. రైతులు పుట్లకు పుట్లు వడ్లు పండించుకున్నారు. అటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు మాట్లాడుతారా?. కేవలం విపక్షాలు కొందర్ని పోగేసి.. రైతుల ముసుగులో డ్రామాలు ఆడిస్తున్నాయి. కొన్ని చోట్ల అకాల వర్షాల కారణంగా ధాన్యం తడవడంతో.. వాటిని ఎండబెట్టండి తీసుకుంటామని.. చెప్పడం జరిగింది. ఇప్పుడు అక్కడక్కడ మిగిలిపోయిన కుప్పలు అవే. వీటిని చూపి.. సగం కూడా వడ్లు కొనలేదనడం కరెక్ట్ కాదు. వెలుగు కూడా ఆంధ్రా పత్రికల్లాగా విష పత్రికగా మారకుండా.. సరైన రాతలు రాసి.. ప్రజలకు వాస్తవాలు చెప్పండి.