తెలంగాణ స్థానికులకే ఉద్యోగాలంటే నీకు ఏం నొప్పి.. మల్లన్న…

 

  • తెలంగాణ స్థానికులకే ఉద్యోగాలంటే నీకు ఏం నొప్పి.. మల్లన్న…
  • తెలంగాణ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంటే దీనిపైన నీ రంధ్రాన్వేషణ ఏంది…
  • తెలంగాణ క్యాబినెట్ పై అవాకులు పేలితే నీ తాట తీస్తారు…
  • ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే నిన్ను భూస్థాపితం చేయ‌క‌ తప్పదు…

అరె తీన్మార్ మల్లన్న ఇందుకే కదా మీ ప్రతిపక్షాలను తరిమితరిమి కొట్టింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని బృహత్తర నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటే దానిపై అవాకులు చెవాకులు పేలి మీ నీచ నికృష్ట బుద్ధిని క‌న‌బ‌రుస్తున్నావ్. తెలంగాణ ప్రజలకు ప్రైవేటు పరిశ్రమలలో ఉద్యోగాలు రావడం మీకు ఇష్టం లేనట్లుగా కనిపిస్తోంది. ప్రపంచంలో ఉన్న బృహత్తరమైన పరిశ్రమలకు సంబంధించి ప్రతి పరిశ్రమ యూనిట్‌ హైదరాబాద్లో ఉన్న సంగతి మీకు తెలియదా. గత ఆరేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం సరళీకరణ విధానాల ద్వారా పెట్టుబడులతో పాటు అనేక పరిశ్రమలు రాష్ట్రానికి ఎన్నో వచ్చాయి.

ఇప్పటికికూడా ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం తీర్మానించింది కద. ప్రతిదానికి తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే విధంగా పనికిమాలిన నీ యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు చేస్తూ ఏదేదో గొప్ప పని చేస్తున్నట్టు భావిస్తున్న నువ్వు దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.

ఇక తెలంగాణ ప్రభుత్వం క్యాబినెట్ సమావేశం అవుతే కూడా దాని పై దుష్ప్రచారం చేస్తున్న నువ్వు త్వరలోనే ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్ప‌క‌ తప్పదు. అయోధ్యలో రామమందిరాన్ని కి శంకుస్థాపన చేస్తున్న సమయంలోనే క్యాబినెట్ ఎందుకు నిర్వహిస్తున్నారనే నీ ప్రశ్న తలాతోకా లేకుండా ఉన్నదని తెలుసుకో. తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో సుదీర్ఘకాలంపాటు స‌మావేశం అయినా రాష్ట్ర క్యాబినెట్ ఖ‌త‌ర్నాక్‌ నిర్ణయం తీసుకుంటే దాని గురించి ఆలోచించకుండా దాంట్లో పుల్ల‌లు పెడితే నిన్ను చరిత్ర క్షమించదు అని తెలుసుకో. నీలాంటి వాళ్లు కుక్కలాగా ఎంత మొరిగినా కూడా ఏనుగు లాంటి తెలంగాణ ప్రభుత్వానికి ఏమీ కాదని ఇప్పటికైనా అర్థం చేసుకో. ఇక ప్రస్తుత నిర్ణయం అనేది చేసి జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే తెలంగాణ ప్రభుత్వం చేపట్టినది అనే నీ వ్యాఖ్యలు చూస్తే అంద‌రికీ క‌డుపుబ్బా న‌వ్వు వస్తున్నది.

గత ఆరేళ్లుగా తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో వార్ వన్ సైడ్ లాగానే టిఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాలను కైవసం చేసుకుంది. ఐదేళ్ల కిందట నే దాదాపు 100కు పైగా కార్పొరేటర్‌ స్థానాలను గెలుచుకొని ఒంటిచేత్తో హైదరాబాద్ కార్పోరేష‌న్‌ను సంస్థాగతం చేసుకుంది. అసలు ఉనికిలో లేని ప్రతిపక్షాల గురించి ఆలోచించే సమయం సీఎం కేసీఆర్ కు లేదని తెలుసుకో. ఏదేమైనా ప్రజలకు మంచి చేసే నిర్ణయాలపై కూడా హర్షం వ్యక్తం చేయకుండా దాన్ని అప్రదిష్టపాలు చేసే విధంగా వ్య‌వ‌హరిస్తే నిన్ను తరిమి తరిమి కొడతారని తెలుసుకో మల్లన్న.