రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన ఒరిగేదేం లేదు.

 

  • రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన ఒరిగేదేం లేదు.
  • కాంగ్రెస్ నాయకులు చాలాఎక్కువ ఊహించుకుంటున్నారు.
  • సీపీ మీద గవర్నర్ కు కంప్లైంట్ చేయగానే చర్యలు తీసుకుంటారా?.
  • శాంతి భద్రతల్లో భాగంగానే కాంగ్రెస్ ర్యాలీకి అనుమతి ఇవ్వలే.
  • ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ కు పర్మీషన్లు ఇచ్చారా?.

కాంగ్రెస్  ఆవిర్భావ దినోత్సవం పేరుతో సీఏఏ మీద రచ్చ చేయాలని చూసినందుకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారమే కాంగ్రెస్ ర్యాలీకి పర్మీషన్ ఇవ్వలేదు. కాంగ్రెస్ ర్యాలీలో సంఘ విద్రోహశక్తులు పాల్గొనే అవకాశం ఉంది. ఫలితంగా హింస  చోటుచేసుకుంటుందని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. రాజధాని నగరంలో హింస జరిగితే.. అది అక్కడితో ఆగకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు విస్తరిస్తుంది. ఇవన్నీ ముందే గ్రహించి.. పోలీసులు కాంగ్రెస్ ర్యాలీకి పర్మీషన్ ఇవ్వలేదు. అయినా ఆవిర్భావ దినోత్సవం రోజు.. మత పరమైన విద్వేషాలు రెచ్చగొట్టాలని చూశారు. సీఏఏ పేరుతో రాజకీయాలు చేయాలనుకున్నారు. కానీ మీ ప్రయత్నానికి పోలీసులు బ్రేకులు వేశారు.

కాంగ్రెస్ నిషేధిత సంస్థా అని ప్రశ్నిస్తున్న ఉత్తమ్.. గతంలో ఏళ్ల తరబడి అధికారంలో ఉన్న మీకు తెలియదా?. పోలీసులు ఏ విధంగా పనిచేస్తారో. వాళ్ల డ్యూటీ వాళ్లు చేసినా.. వెళ్లి గవర్నర్ కు కంప్లైంట్ ఇవ్వడం ఏంటో విడ్డూరంగా ఉంది. గవర్నర్ కు కాదు.. ప్రెసిడెంట్ కు ఫిర్యాదు చేసినా ఒరిగేది ఏమీ లేదు. మీరు ఇచ్చిన లెటర్ రాజ్ భవన్ చెత్తకుప్పలోకి వెళ్లడం తప్ప దానితో ఏమీ కాదు. గవర్నర్ తో భేటీ అంటూ ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప మీకు ఏదీ చేతకాదు.

రాజ్యాంగం, రాజ్యాంగ హక్కులంటూ వల్లె వేస్తున్న కాంగ్రెస్ నాయకులు ఒక్కసారి ఉద్యమ రోజులు గుర్తు తెచ్చుకుంటే మంచిది. ర్యాలీలు కాదు.. కనీసం రోడ్లపై శాంతియుత నిరసన తెలుపుతామన్న పర్మీషన్లు ఇచ్చారా?. దొరికిన వాళ్లను దొరికినట్లే సిటీకి దూరంగా తరలించారు కదా?. నాడు మీరు చెప్పిన డైలాగులు.. హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ కావొద్దనే అలా చేశామన్నారు. ఇప్పుడు కూడా అంతే విశ్వనగరంగా పేరొందుతున్న హైదరాబాద్ లో ఎటువంటి గొడవలు జరగొద్దనే కాంగ్రెస్ ర్యాలీకి పర్మీషన్ ఇవ్వలేదు. దీనికి ఎందుకింత రాద్దాంతం ఉత్తమ్.