తెలంగాణ లౌకిక భూమి అదే నినాదానికి కట్టుబడి సిఏఏ, ఎన్సిఆర్, ఎన్పిఆర్ లకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ తీర్మానం. 

 

  • తెలంగాణ లౌకిక భూమి అదే నినాదానికి కట్టుబడి సిఏఏ, ఎన్సిఆర్, ఎన్పిఆర్ లకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ తీర్మానం. 
  • తుచ్చమైన అధికారం కోసం దేశ గౌరవాన్ని తాకట్టు పెట్టబొమన్న సీఎం కేసీఆర్. 
  • రాజ్యాంగాన్ని గుండెల్లో పెట్టుకొని ఆ విలువల స్పూర్తిగా తెలంగాణ రాష్ట్రం ముందుకుపోతుందన్న ముఖ్యమంత్రి. 
గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు అసెంబ్లీ సాక్షిగా సీఏఏ, ఎన్సీఆర్, ఎన్పీఆర్ లాంటి మత ప్రాతిపదికన కేంద్రం ప్రభుత్వం తీసుకున్న బిల్లులను వ్యతిరేకిస్తున్నట్టు తీర్మానాలు చేయడం జరిగింది. తెలంగాణ భూమి మొదటి నుంచి కూడా లౌకిక భూమి.ఎక్కువ శాతం ముస్లిం రాజుల చేత పరిపాలనలో ఉన్న కూడా హిందువుల అధిక జనాభాతో ఎప్పుడు కూడా గంగా జమున తెహజీబ్ లా కలిసి ఉండి,దేశానికి ఎప్పటికప్పుడు ఒక మంచి సంకేతాన్ని, సద్భావన కలిగిస్తూనే ఉంది.
మతపిచ్చితో కళ్ళు మూసుకుపోయిన కేంద్రప్రభుత్వానికి కళ్లు తెరిపించాలని ఉద్దేశంతో సిఏఏ,ఎన్సీఆర్, ఎన్పీఆర్ లాంటి చట్టాలను వ్యతిరేకిస్తున్నట్టు తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు చేసిన ప్రసంగం దేశ ప్రజలందరూ కూడా రోమాలు నిక్కబొడుచుకునే లెవెల్ లో ఉంది అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ తుచ్ఛమైన అధికారం కోసం అత్యున్నతమైన చరిత్ర ఉన్న దేశ గౌరవాన్ని ఏనాటికి కూడా తాకట్టు పెట్టబోమని ఖరాఖండీగా చెప్పడం జరిగింది. రాజ్యాంగాన్ని గుండెల్లో పెట్టుకున్న తెరాస ప్రభుత్వం అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతుంది అని చెప్పడం జరిగింది.కెసిఆర్ నిర్ణయం పట్ల యావత్ తెలంగాణ రాష్ట్రం సంతోషం వ్యక్తం చేస్తూ ఉంది.