ఆరేళ్లలో భర్తీ చేసిన ఉద్యోగాలు కనిపిస్తాలేవా ..తీన్మార్ మల్లన్న…

 

  • ఆరేళ్లలో భర్తీ చేసిన ఉద్యోగాలు కనిపిస్తాలేవా ..తీన్మార్ మల్లన్న…
  • కళ్ళు ఉన్న కబోదిలా వ్యవహరిస్తున్న నీ భరతాన్ని ప్రజలు పడతారు…
  • ప్రతిపక్షాలకు అమ్ముడుపోయి అక్షర వ్య‌భిచారం చేస్తున్న‌, నిన్ను చరిత్ర క్షమించదు…
  • త్వరలోనే నిన్ను, తెలంగాణ ద్రోహులను తరిమి కొడతారని తెలుసుకో…

 

తెలంగాణకు ద్రోహం చేసే విధంగా వెలుగు దినపత్రిక, తీన్మార్ మల్లన్న కలిసి ప్రయత్నిస్తున్నట్లు అర్ధం అవుతోంది. తాజాగా నిరుద్యోగ తెలంగాణ పేరుతో ఆ వెలుగు దినపత్రిక బ్యాన‌ర్‌ స్టోరీ ప్రచురించగా దాన్ని పై మల్లన్న అవాకులు చెవాకులు పేలి త‌న నీచ‌బుద్ధిని బ‌య‌ట‌ పెట్టుకున్నాడు. నిజానికి గత ఆరేళ్లలో తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి 80 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనమైన చరిత్ర తెలంగాణ సొంతం. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన విద్యుత్ ఉద్యోగుల విలీనం ద్వారా వాళ్లను శాశ్వత ఉద్యోగులుగా మార్చిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు సొంతం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అలాగే ఎప్పుడో మ‌రుగున ప‌డిన సింగ‌రేణి వార‌స‌త్వ ఉద్యోగాల‌ను పున‌రుద్ధ‌రించి, కార్మికుల గుండెల్లో సీఎం కేసీఆర్ నిలిచిపోయాడు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ఏ నోటిఫికేషన్లు జారీ చేసిన కోర్టుల్లో కేసులు వేస్తూ అనేక రకాలుగా నిరుద్యోగుల ఇబ్బందులకు గురి చేస్తూ కాలయాపన చేస్తూ ప్రతిపక్షాలు నానారకాలుగా నాట‌కాలు ఆడుతున్నాయి.
ఇక తీన్మార్ మల్లన్న కు ఏమి పని లేనట్టుగా ఊ అంటే కేసీఆర్ మీద పడి ఏడుస్తున్నాడు. కేసీఆర్ కుటుంబం లో ఎంత మంది రాజకీయ నాయకులుగా ఎదిగారు అని ఆడిపోసుకుంటారు. అస‌లు ప్రజలందరూ ఓట్లు వేసి నాయకులుగా గుర్తిస్తేనే వాళ్లకు పదవులు వచ్చాయనే విషయం కావాలనే విస్మరిస్తన్నాడు.

పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ను ఎమ్మెల్యే పదవికి పోటీ చేస్తే అక్కడి ప్రజలు గుర్తించక అతన్ని ఓడించి సంగతి నీకు తెలియదా. ఎవరైతే తమకు న్యాయం చేస్తామని భావిస్తారో వాళ్ళకి ప్రజలు ఓటు హక్కు ద్వారా తమ సమ్మతిని తెలియజేస్తున్నారు, అలాంటి నాయ‌కులే  పదవులను అలంకరిస్తారు. ఇలాంటి బేసిక్ విషయం తెలియని తీన్మార్ మల్లన్న ఇంకా జర్నలిస్ట్ గా ఎలా కొనసాగుతున్నాడు ఎంత జుట్టు పీక్కున్న‌ అర్థం కావడం లేదు. ఎప్పుడు తెలంగాణ ప్రభుత్వం పై ప‌డి ఏడ్వ‌డ‌మే త‌ప్పించి, నిర్మాణాత్మక సలహాలు ఇవ్వకపోవడంతో ప్రతిపక్షాలను స‌మాజ‌మంతా తరిమికొట్టింది. తెలంగాణ ప్రభుత్వం పై మీరు ఎంతగా దుష్ఫ‌చారం చేసిన  ప్రజల ముందు మీ ఆటలు సాగవు. త్వరలోనే మిమ్మల్ని భూస్థాపితం చేసి దాని మీదుగా బంగారు తెలంగాణను నిర్మాణం చేస్తారు అని తెలుసుకోండి…