బయట తిరిగితే బలవుతరు బిడ్డా!

 

  • బయట తిరిగితే బలవుతరు బిడ్డా!
  • ప్రభుత్వం చెప్పినట్టు వినండి
  • ఇంట్లో గడపడం శ్రేయస్కరం

కరోనా వ్యాధి తీవ్రత గురించి ప్రత్యేక వివరించాల్సిన అవసరం లేదు. ఇది ఎంత డేంజరో దాదాపు ప్రతి ఒక్కరికీ తెలిసింది. అయితే కొందరు మూర్ఖులు పని లేకున్నా రోడ్లపైకి వచ్చి తిరుగుతున్నారు. వాళ్లు ప్రమాదంలో పడుతూ ఇతరులను ప్రమాదంలోకి నెడుతున్నారు. ఇది ఎవరికీ మంచిది కాదు. వ్యాధిని అడ్డుకోవడానికి ప్రభుత్వం విపరీతంగా శ్రమిస్తోంది. ఇదంతా మన కోసం చేస్తున్నది. కేసీఆర్​ కోసమో ఆయన కుటుంబం కోసమో కాదు. జరగరానిది ఏదైనా జరిగాక ఏడ్వడం కందే ముందుజాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.

కొందరు య‌థావిధిగా పెళ్లిళ్ల‌కు పేరంటాల‌కు వెళ్తున్నారు. పార్టీలు చేసుకుంటున్నారు. చిన్న పిల్ల‌లు అంతా క‌లిసి ఆడుకుంటున్నారు.  ఇది సరైంది కాదు. ఈ నెల రోజులు క‌చ్చితంగా జాగ్ర‌త్త‌గా ఉండాలి. మ‌హామ‌హా అమెరికా వంటి దేశాలే కరోనాతో అల్లాడుతున్నాయి. మ‌న‌లాంటి పేద దేశాల్లో ఈ వ్యాధి ఎక్కువైతే ప్రాణ‌న‌ష్టం తీవ్ర‌మ‌వుతుంది. ఆర్థికవ్య‌వ‌స్థ మాంద్యంలోకి వెళ్లిపోతుంది. పేద‌రికం విప‌రీతంగా పెరుగుతుంది. ఆస్ప‌త్రులు చాల‌వు. మందులు స‌రిప‌డా ఉండ‌వు. తెలంగాణ ప్ర‌భుత్వం ఈ విష‌యంలో అనుక్ష‌ణం అప్ర‌మ‌త్త‌మంగా ఉంటోంది. ప్ర‌జ‌లు అత్య‌వ‌స‌రం అయితే తప్ప బ‌య‌టికి  రావొద్దు. పోలీసులు, ప్రభుత్వం సూచనలను తూచ తప్పకుండా పాటించాలి.