ప్రాజెక్టు నిర్మించిన‌ప్పుడు ఏమీ మాట్లాడ‌లేదు

 

  • రేవంత్ రెడ్డికి పోతిరెడ్డిపాడు ఇప్పుడు గుర్తొచ్చింది…
  • ప్రాజెక్టు నిర్మించిన‌ప్పుడు ఏమీ మాట్లాడ‌లేదు
  • పోతిరెడ్డిపాడుకు హార‌తులు ఇచ్చినా మాట్లాడ‌లేదు
  • ఇప్పుడు మాత్రం బ‌ట్ట‌లు చింపుకుంటున్న‌ది

కుంభ‌కోణాల‌కు, అవినీతికి కేరాఫ్ అడ్ర‌స్ అయిన రేవంత్ రెడ్డి కూడా రైతుల స‌మ‌స్య‌ల గురించి మాట్లాడుతుంటాడు. వాళ్ల గురించి మొస‌లి క‌న్నీరు కారుస్తుంట‌డు. పోతిరెడ్డిపాడు అక్ర‌మం అంటూ గుండెలు బాదుకుంట‌డు. అవ‌స‌రం అయితే మ‌రోసారి జైలుకు వెళ్ల‌డానికి రెడీ అంట‌డు. అలుపెర‌గ‌ని పోరాటం అంట‌డు. ఇవ‌న్నీ మ‌నం క‌ళ్ల‌మూసుకొని న‌మ్మాలి. అబ్బ ఎంత మంచోడు అనుకోవాలి! పోతిరెడ్డిపాడు ఉన్న‌ది రేవంత్ సొంత జిల్లా అయిన మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో. ఆ ప్రాజెక్టుల‌ను వైఎస్సార్ మొద‌లుపెట్టిన‌ప్పుడు ఈ రైతుబాంధ‌వుడు ఒక్క మాటా మాట్లాడ‌లేదు. ఆ ప్రాజెక్టుకు హార‌తులు ప‌డితే నోరు తెర‌వ‌లేదు. ఒక్క స్టేట్‌మెంట్ ఇవ్వ‌లేదు. ఇప్పుడు మాత్రం అదే ప్రాజెక్టుపై విరుచుకుప‌డుతున్న‌డు.

అస‌లు కేసీఆర్ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, కేసీఆర్‌, జ‌గ‌న్ కుమ్మ‌క్కు అయ్యార‌ని పిచ్చిమాట‌లు మాట్లాడుతున్నారు. నిజంగా వీళ్లిద్ద‌రూ కుమ్మ‌క్కు అయి ఉంటే.. కాళేశ్వ‌రం స‌హా దక్షిణ తెలంగాణ‌లోని ప్రాజెక్టుల‌న్నీ ఇల్లీగ‌ల్ అని జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఫిర్యాదు చేస్తుందా ? కేసీఆర్ క‌నీసం మాటైనా చెప్ప‌కుండానే జీఓ విడుద‌ల చేస్తుందా ? జగన్ను కేసీఆర్ నమ్మిన మాట నిజం. కానీ అతడు కూచున్న కొమ్మను నరుక్కుంటాడని ఊహించలేదు. ఇందుకు అతడు మూల్యం చెల్లించకతప్పదు. పోతిరెడ్డిపాడుకు శంకుస్థాపన జరిగిన రోజే కేసీఆర్ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించాడు. ప్రభుత్వ ఏజెన్సీలకు ఫిర్యాదు చేశారు. ఉద్యమాలు చేశారు. వైఎస్సార్ అక్రమాలను ఎండగడుతూ తెరాస నాయకులు వ్యాసాలు రాశారు.

తెరాస వైఖరి ఎన్నడూ మారలేదు. రేవంత్ మాత్రం పార్టీ మారినప్పుడల్లా తన వైఖరి మార్చుకుంటున్నడు. ఎంతైనా రాజకీయ వ్యభిచారం కదా! రెండు నాల్కల ధోరణి సహజం. ఈ ప్రాజెక్టుకు నిరసనగా అప్పట్లో మంత్రి పదవులకు రాజీనామా చేసిందే టీఆర్ఎస్. అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ గురించి కాంగ్రెస్, టీడీపీ నాయకులు పట్టించుకోలేదు. పోతిరెడ్డి విష‌యంలో కాంగ్రెస్‌, బీజేపీలు దొంగ నాట‌కాలు ఆడుతున్నాయి. తెలంగాణ పీసీసీ ఒకటి మాట్లాడితే.. ఏపీ పీసీసీ మరొకటి మాట్లాడుతున్నది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒకటి మాట్లాడితే.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు మరొకటి మాట్లాడుతున్నారు. కేసీఆర్ శ్రద్ధచూపడం వల్ల రెగ్యులేటర్ వెడల్పు పనులు ఆపాలని జగన్ ప్రభుత్వానికి ఆదేశాలు అందాయి. కేసీఆర్ కాంప్రమైజ్ అయి ఉంటే ప్రాజెక్టు పనులు యథావిధిగా కొనసాగేవి.