అసలు నీ నొప్పేంది రేవంత్ రెడ్డి

 

  1. అసలు నీ నొప్పేంది రేవంత్ రెడ్డి
  2. కరోనా విపత్తును కూడా వదలవా?
  3. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నదే నువ్వు
  4. రేవంత్.. నీకు రోజులు దగ్గర పడ్డాయి.. అంతే ఇలా వాగుతున్నావు

రేవంత్ రెడ్డి… మొరిగే కుక్క కరవదు.. అనే టైప్. అది తెలంగాణ ప్రజలకు ఎప్పుడో తెలుసు. ఎప్పుడూ వార్తల్లో నిలవాలి… ఏదో చేయాలి.. అని అనుకునే టైప్. దాని కోసమే ఏదో ఒకటి చేస్తుంటాడు. పేరుకే ఎంపీ కానీ.. ఆయన ఎంపీ అవడం వల్ల ప్రయోజనం సున్నా. అసలు.. ఏనాడైనా తన నియోజకవర్గాన్ని పట్టించుకుంటే కదా. ఎప్పుడూ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం తప్పితే ఆయనకు ఇంకో పనే లేదాయె. ఇంకా తన నియోజకవర్గం ప్రజలను ఎందుకు పట్టించుకుంటడు. చివరకు కరోనాను కూడా రాజకీయం చేస్తుండె.

అసలే.. కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. పెద్ద పెద్ద దేశాలే కరోనా కింద కుదేల్ మన్నాయి. అటువంటప్పుడు మనం ఎంతో జాగ్రత్తలో ఉండాలి కదా. కరోనాను అరికట్టడం ఒక్క ప్రభుత్వం పనేనా? మిగితా పార్టీలు చూస్తూ కూర్చుంటాయా? కరోనా అనేది ఒక మహా విపత్తు. దాని కట్టడి కోసం ప్రతిఒక్కరూ ముందుకు రావాలి కానీ.. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న ప్రభుత్వాన్ని పట్టుకొని కిందికి లాగడం ఏంది రేవంత్. మీకు బాధ్యత లేదా? నువ్వు ఒక బాధ్యతాయుతమైన ఎంపీవి. మరి.. కరోనా కట్టడి కోసం నువ్వు చేసిన ప్రయత్నాలు ఏవి? నీ నియోజకవర్గం ప్రజలను నువ్వు ఏనాడు పట్టించుకున్నావు.

ఏమన్నా అంటే సీఎస్ ను తొలగించాలి. . హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీని తొలగించాలి అంటావు.. ముందు కరోనాను కట్టడి చేయాలా? లేక ఇలాంటి పనులు చేస్తూ కూర్చోవాలా? కొంచెమైనా నీకు మానవత్వం ఉంటే ఇలా మాట్లాడవు. కరోనాను కూడా నీ రాజకీయం కోసం ఉపయోగించుకోవు. హైదరాబాద్ ను ఎవ్వరూ ఖాళీ చేయడం లేదు. కొందరు ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేస్తుండటంతో కొన్ని రోజుల కోసం తమ ఊళ్లకు వెళ్లారు తప్పితే హైదరాబాద్ ఎన్నటికీ ఖాళీ కాదు. ఖాళీ అయ్యే ప్రసక్తే లేదు. అసలు.. నీ నియోజకవర్గంలో కరోనా కట్టడికి నువ్వేం చేశావో ముందు శ్వేతపత్రం విడుదల చేయి రేవంత్. నువ్వు ఎంపీ అవడం వల్ల మల్కజ్ గిరి ప్రజలకు వచ్చిన ప్రయోజనం ఏం లేదు.

దేన్నో పట్టుకొని ఏదో చేద్దాం అని నువ్వు అనుకుంటావు కానీ.. నీ పప్పులేవీ ఉడకవు ఇక్కడ. సీఎం కేసీఆర్ కు కరోనా వచ్చిందనేది పచ్చి అబద్ధం అని చెప్పినా కూడా మళ్లీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేయాలి, శ్వేత పత్రం విడుదల చేయాలి అంటూ పనికిమాలిన మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు. ఏదో ఒకటి వాగకుండా నీ నోరు ఉండదా ఏంటి? కరోనా కట్టడి కోసం ఏ ప్రభుత్వమూ చేయనంతగా తెలంగాణ ప్రభుత్వం చేస్తోంది. కేసులు ఎక్కువగా వస్తున్న ప్రాంతాల్లో టెస్టులను పెంచడంతో పాటుగా… కొత్తగా 100 అంబులెన్సులను కూడా తీసుకొస్తోంది. కరోనా టెస్టులను కూడా ఆసుపత్రుల్లో ఉచితంగా చేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వాళ్ల వైద్యసేవల్లో ఎటువంటి డోకా లేదు. కరోనా సోకిన వాళ్లలో 50 శాతానికి ఎక్కువే డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో మరణాల రేటు కూడా చాలా తక్కువ. మిగితా రాష్ట్రాలతో పోల్చిన తెలంగాణలో కరోనా అంత తీవ్ర స్థాయిలో లేదు. అయినప్పటికీ కావాలని తెలంగాణ ప్రభుత్వంపై ఇలాంటి ఆరోపణలు చేయడం నీ లేకితనానికి నిదర్శనం రేవంత్ రెడ్డి.