రేవంత్‌.. ఎప్ప‌టికీ నీకు బెయిల్‌పైనే ధ్యాసా..

 

  • రేవంత్‌.. ఎప్ప‌టికీ నీకు బెయిల్‌పైనే ధ్యాసా..
  • జైలు బుద్ధులు పోనిచ్చుకోవా..?
  • క‌రోనా వ్యాధిపై ఎంపీగా బాధ్య‌తాయుతంగా మాట్లాడు..

 

తెలంగాణ లోక్సభ సభ్యుడు రేవంత్ రెడ్డికి ఎప్పడు జైలు ధ్యాసే ఉన్నట్లు కనిపిస్తోంది. దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా coronavirus వ్యాపించి బాధపడుతుంటే జైల్లో ఉన్న వ్యక్తులకు బెయిల్‌, పెరోలు ఇప్పించాలని కారుకూతలు కూస్తున్నాడు. తెలంగాణ ప్రభుత్వం  వైరస్ను అరికట్టేందుకు ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంది. దేశంలోనే అందరికంటే ముందుగా జ‌న‌సమర్థ ప్రాంతాలను మూసి వేయడంతో పాటు ప్రస్తుతం లాక్‌డౌన్ కూడా అందరి కంటే ముందుగా ప్రకటించింది. ఇక ఫీవర్ ప్రభావిత ప్రాంతంగా ను తెలంగాణలో ప్రకటించి అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది. అలాంటి తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు ఏమీ అవసరం లేదని రేవంత్‌ తెలుసుకుంటే మంచిది. ఇప్పటికే దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం పై ప్రశంసల జల్లు కురుస్తోంది. దేశంలోనే చాలా తక్కువ కేసులు నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వానికి సహకరించడం మానేసి, ఇలాంటి వెధవ సూచ‌న‌లు ఇవ్వకుంటే మంచిది.

మరోవైపు కరీంనగర్ లో క‌రోనా వైర‌స్‌ దుర్ఘటనను తెలంగాణ ప్రభుత్వం ఎంత చ‌క్క‌గానో డీల్‌ చేసింది. అతి తక్కువ వ్యవధిలో వాళ్లందర్నీ పట్టుకొని క్వారంటైన్‌కు తరలించడంతో పాటు, ప్రధాన సూత్రధారిని కూడా అదుపులోకి తీసుకుంది. దీంతో దేశ వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం పై పొగడ్తల జల్లు కురుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులైన‌ కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో వైర‌స్‌ను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోంది. ఇప్పటికే కరుణ మహమ్మారిని అడ్డుకుని అందరిలోనూ భరోసా నింపింది.