క్రిమినల్ మైండ్ తో ప్రభుత్వ భూమిని కొట్టేసిన రేవంత్ రెడ్డి..

 

  • క్రిమినల్ మైండ్ తో ప్రభుత్వ భూమిని కొట్టేసిన రేవంత్ రెడ్డి..
  • కోట్ల రూ.ల ప్రభుత్వ భూమిని తప్పుడు పత్రాలతో కొల్లగొట్టిన వైనం…
  • ఇలాంటి నాయకులు వల్ల ప్రజాస్వామ్యంపై నమ్మకం పోతుంది అంటున్న విశ్లేషకులు…
  • రేవంత్ రెడ్డి అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వానికి సూచిస్తున్న వైనం…

తెలంగాణ రాజధాని హైదరాబాదులో తాజాగా బయటపడిన భూ కుంభకోణంలో పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి పాత్ర, అతని క్రిమినల్ మైండ్ పై అందరూ చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ భూమిని కొల్లగొట్టేందుకు తాను చేసిన ఆ ప్రణాళికలపై అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. క్రిమినల్ మైండ్ తో తాను చేసిన ఈ భూ కుంభకోణాలు చూసి అందరు విస్తుపోతున్నారు.

ఖాళీ జాగా ఎక్కడ కనపడినా వదిలి పెట్టడు అనే విధంగా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు అని విమర్శిస్తున్నారు. హైదరాబాద్ శివార్లలోని గోపనపల్లి లో కోట్లాది రూపాయల విలువ చేసే భూమిని తొలుత రేవంత్రెడ్డి గుర్తించాడు. దీనికి సరైన వారసులు ఎవరూ లేరని తెలుసుకుని రేవంత్రెడ్డి నెమ్మదిగా దాన్ని తన ఖాతాలో వేసుకోవాలని నీచమైన ప్లాన్స్ దిగాడు. రెవెన్యూ అధికారులను నయానో భయానో ఒప్పించి తొలుత ఈ భూమిని తన బినామీ ఇలా పేరు పైకి మార్చుకున్నాడు. అనంతరం దాన్ని వాళ్ల నుంచి కొనుగోలు చేసినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి కోట్లాది రూపాయల విలువ చేసే భూమిని దక్కించుకున్నాడు.

ఈ వ్యవహారంలో తన సోదరుడు కొండల్రెడ్డి పాత్రను కూడా అధికారులు స్పష్టంగా గుర్తించారు. గతంలో శాసన సభ్యుడిగా వ్యవహరించిన రేవంత్ రెడ్డి.. ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడిగా ఉన్నతమైన హోదాలో ఉన్నాడు. ప్రజలకు మంచి చెప్పాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటివి కుంభకోణాలకు పాల్గొనడం ఏమిటని రేవంత్రెడ్డిని అందరు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఓటుకు నోటు కేసులో చిక్కుకొని జైలులో చిప్పకూడు తిన్నా రేవంత్ రెడ్డి కి బుద్ధి రాలేదని, తాజా భూకుంభకోణం దాన్ని తలదన్నేలా ఉందని అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి అవినీతి అక్రమార్కుల పై ఉక్కుపాదం మోపి అందరికీ బుద్ధి వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఏదేమైనా రేవంత్ రెడ్డిలాంటి నాయకుల వల్ల ప్రజాస్వామ్యంపై నమ్మకం పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.