రాంమాధ‌వ్‌.. నీకు చదవడం, రాయ‌డం వచ్చా.

 

* రాంమాధ‌వ్‌.. నీకు చదవడం, రాయ‌డం వచ్చా.
* క‌రోనా వైర‌స్‌ గురించి తెలంగాణ ప్రభుత్వం రోజు బులిటెన్ విడుదల చేస్తుందని తెలుసుకో.
* అనవసరంగా తెలంగాణపై దుష్ప్రచారం చేస్తే నీ నాలుక చీరేస్తాం.

బుర్రలో ఇంత కూడా గుజ్జు లేని రాంమాధ‌వ్‌ లాంటి నేత భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా అయ్యాడో అర్ధం కావడం లేదు. ప్రతిరోజు క‌రోనా వైరస్ కు సంబంధించిన వివ‌రాల‌ను తెలంగాణ ప్రభుత్వం ఒక బుల‌టెన్‌ రూపంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులోనే రోజు ఎన్ని టెస్టులు చేశారు ఎంతమంది పాజిటివ్ గా మారారు ఎంతమంది కోలుకున్నారు. ఎంత మంది మరణించారని విషయాలను జిల్లా లతో సహా కూలంకశంగా పొందుతున్నారు.

ఇక రాంమాధ‌వ్‌ ఇప్పుడే నిద్ర నుంచి లేచిన కుంభకర్ణులు లాగా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయడమే లక్ష్యంగా లేనిపోని అవాస్తవ కథనాలు వండి వారుస్తున్నాడు. తెలంగాణ ప్రభుత్వం రోజుకు మూడు వేల చేస్తుందని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నాడు. ఆ విషయాన్ని ప్రతి రోజు హెల్త్ బులిటెన్‌లో తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా వివరిస్తున్నది కదా. ఎక్కడ కూడా 14, 13 వేల టెస్టులను చేస్తున్నామని చెప్పడం లేదు. ఈ విధంగా బాగా వాగి బుర్రలేని భారతీయ జనతా పార్టీ నేతలు అడ్డంగా బుక్కయ్యారు. రోజుకు ఐదు వేలకు పైగా టెస్టులు చేసే యంత్రాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆర్డర్ ఇస్తే దాన్ని అక్రమంగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఇచ్చింది మీ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ సర్కారు కాదా.

ముందుగా దానికి సమాధానం చెప్పి మాట్లాడండి. ఓవైపు ఏమో వైరస్ పై దొంగ దెబ్బ తీసిన మరోవైపు టెస్ట్ చేయడం లేదు అది చేయడం లేదు అంటే కాకమ్మ కబుర్లు చెబితే నమ్మడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు. మీలాంటి ఎదవన్నర ఎదవ లో ఎన్ని వేషాలు వేసినా  విజ్ఞులైన తెలంగాణ ప్రజల ముందు దిగదుడుపే అని తెలుసుకో. ఇక బండి సంజయ్ అనే కొత్త బిచ్చగాడు తెలంగాణ ప్రభుత్వం పై అవాకులు చవాకులు పేలి అజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నాడు. క‌రోనా వైరస్ ను అడ్డుకోవడానికి కేంద్ర మేము గుట్టలుగుట్టలుగా పైసలు ఇచ్చిందట తెలంగాణ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తోందని తెలిసి తెలియని మాటలు మాట్లాడుతూ తన లుచ్చ‌త‌నాన్ని కనబరుస్తున్నాడు. ఇలాంటి పనికిమాలిన లుచ్చా నేతలు తెలంగాణ బీజేపీ లో ఉంటే కేంద్రం తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది. ఇప్పటికైనా ఇలాంటి నేతలను తరిమి తరిమి కొడితే తెలంగాణ అన్ని విధాలుగా సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.