రైతుబంధుపై కాంగీల‌  దుష్ప్రచారం…

 

  • రైతుబంధుపై కాంగీల‌  దుష్ప్రచారం…
  • ఇలాంటి గొప్ప పథకాన్ని ఏనాడైనా కాంగ్రెస్ నేతలు ప్రవేశపెట్టారా…?
  •  మీకు స్కాములు తప్ప ప్రజా సంక్షేమం ఎప్పుడు పట్టింది గ‌నుక…
  • అందరూ చీకొట్టినా మీకు ఇంకా బుద్ధి రాలేదు…

 

రైతు బంధు పథకం పై కాంగ్రెస్ పార్టీ చావు కేకలు పెడుతోంది. ముఖ్యంగా నూతన పంట విధానం పై తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని విమర్శిస్తోంది. తరతరాలుగా ఒకే పంటను సాగు చేసిన అప్పుల‌లో ఉన్న రైతులను బయటకు తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ఈ విధానాన్ని ప్రతిపాదించారు. దీన్ని కాస్త కఠినంగా అమలు చేయడం కోసం రైతుబంధు పథకాన్ని దీనికి లింకు పెట్టారు. ఈ నేపథ్యంలో రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు రావాల‌ని అందరు భావిస్తున్నారు. అయితే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ తో పేరు వస్తుందని కలత చెందిన కాంగ్రెస్ పార్టీ అనవసరంగా విమర్శలు చేస్తోంది. రైతు బంధు పథకం తెలంగాణ ప్రభుత్వం మాన‌స పుత్రిక‌. దానికి  ఎందుకు కోత పెడుతుంది అని అందరూ అడుగుతున్నారు.

తూ మీ బ‌తుకు చెడా.. గ‌తంలో ఇలాంటి గొప్ప పథకాలు మీ మెకాల‌కు ఎప్పుడైనా ప్రవేశపెట్టారా… మీకు చేత కాదు ఇంకోక‌రు ఆ పని చేస్తే అస్సలు ఓర్చుకోలేరు అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. రైతుబంధు పథకాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం సహా వివిధ రాష్ట్రాలు కూడా దీన్ని కాపీ కొట్టి ప్రయోజనం పొందాయి. అలాంటి ఫలితం పై కావాలని దుష్ప్రచారం చేస్తూ తమాషాలు చేయాల‌నీ కాంగ్రెస్ పార్టీ అనుకుంటోంది. ఇప్పటికైనా ఇలాంటివి త‌గ్గించుకోలేకపోతే త్వరలోనే ఆ పార్టీ త‌గిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. గతంల మీరంతా రైస్ మిల్ల‌ర్ల ఏజెంట్లుగా పనిచేశారు ఏమో అందుకే మీకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. ఎన్న‌డ స్కాములు, కుంభకోణాల తప్ప ప్రజా సంక్షేమం గురించి ఆలోచించిన పాపాన పోలేదు. అందుకే మీరు ఇలా చరిత్రహీనులుగా మిగిలి పోయారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే మంచిది.