పైసలు కాదు ప్రాణం ముఖ్యం.

 

  • పైసలు కాదు ప్రాణం ముఖ్యం.
  • ఆదాయం పోతే రేపు సంపాదించుకోవచ్చు.
  • కానీ.. ప్రాణం పోతే తిరిగి తీసుకురాగలమా?.
  • ఇదే ప్రతీ ఒక్కరూ ఆలోచించాల్సింది.
  • బయటకెళ్తే బీమారీ వస్తదనే భయం పెట్టుకోండి.

బతికుంటే బలుసాకు తిని బతుకుతాం. కలోగంజో తాగి బతుకుతాం. ఎకానమీ ఎట్లనైనా చేసుకుంటాం. కష్టపడుతాం. తిరిగి రివైవ్‌ అవుతాం. కానీ, ప్రజల జీవితాలను, బతుకును రివైవ్‌ చేసుకోలేం. ప్రాణం పోతే తీసుకురాలేం. అందుకే మనకు ప్రాణాలు ముఖ్యం.. ఇది నిన్నటి సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ సారాంశం. ప్రజల బతుకు గురించి.. తన ప్రజల్ని కాపాడుకోవడం గురించి ముఖ్యమంత్రి ఎంతగా ఆలోచిస్తున్నారనేది చెప్పడానికి ఈ నాలుగు ముక్కలు చాలు. ఇంట్లో ఉండి మమ్మల్ని బంధించారని ఫీలయ్యే వారు.. ఒక్కసారి సీఎం స్పీచ్ వినండి. మీ మనసు మారకపోతే చూడండి.

అవును.. కరోనా మహమ్మారి ఒక్కసారి విజృంభిస్తే.. దానిని ఆపడం ఎవ్వరి తరం కాదు. కరోనాకు మందు కూడా లేదు. మరో ఏడాది పాటు రాదు. మరి ఈ సమయంలో ఆ బీమారి మన దరి చేరకుండా ఉండాలంటే.. లాక్ డౌన్ ఒక్కటే మార్గం. అమెరికా, ఇటలీ, స్పెయిన్ దేశాల్లో శవాల గుట్టలు రోడ్లపై కనిపిస్తున్నాయి. పూడ్చేందుకు స్థలం లేక.. శవాన్ని తీసే వాళ్లు లేక.. దుర్భర పరిస్థితుల్ని ఆ సంపన్న దేశాలు ఎదుర్కొంటున్నాయి. కానీ.. మన దగ్గర  ఆ పరిస్థితి లేదు. కారణం మనం పాటించిన లాక్ డౌనే. ఇదే మనం చేయకుండా ఉండి ఉంటే.. ఇవాళ భారత్ లో ఏ గల్లీ చూసినా శవాల దిబ్బలు కనిపించేవి. ఆ పరిస్థితి మనకు ఎప్పటికీ రావొద్దనే లాక్ డౌన్ పాటించమని ప్రజల్ని కోరేది.

కరోనా మహమ్మారి  కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ స్టార్ట్ అయితే.. దాన్ని ఆపటం ఎవ్వరి వల్ల కాదు. మన దగ్గర సంపన్న దేశాల్లాగా మెడికల్ ఎక్విప్ మెంట్ కూడా లేదు. అంత ఫెసిలిటీస్ కూడా లేవు. చూస్తుండగానే కళ్ల ముందే ప్రాణాలు వదలాల్సిన పరిస్థితి వస్తుంది. ఇటువంటి సిట్యువేషన్ రాకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం ఉంది. అదే లాక్ డౌన్. దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. మరో ఒకటి రెండు వారాలు లాక్ డౌన్ కొనసాగించక తప్పని పరిస్థితి. జనం అర్థం చేసుకోండి. కలో గంజో తాగి ఇంటి పట్టునే ఉండండి. బయటకొచ్చి ఆ మహమ్మారి బారిన ప్రాణాలు తీసుకోకండి.