ధరలు పెంచితే డైరెక్ట్ జైలే

 

  • ధరలు పెంచితే డైరెక్ట్ జైలే
  • రెండో ముచ్చటే లేదు.. పీడీయాక్ట్ పెట్టుడే.
  • కేసీఆర్ అంటే ఆటలనుకుంటున్నార్రా?.
  • ఒకవైపు జనాలు అల్లడం తల్లడం అవుతుంటే..
  • వ్యాపారులు ప్రజల రక్తం పీలుస్తరా?.
  • ప్రభుత్వం ఏం చేయదనుకుంటున్నారా?.

శవాల మీద పేలాలు ఏరుకున్నట్లుంది వ్యాపారులు చేసే పని. ఒకవైపు రాష్ట్రానికి, దేశానికి అత్యవసర పరిస్థితి ఏర్పడింది. మానవాళిని బ్రతికించడం కోసం.. సమాజాన్ని కాపాడటం కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. ఇదే అదునుగా.. లాక్ డౌన్ సాకుతో.. వ్యాపారులు మాత్రం ప్రజల రక్తాల్ని తాగుతున్నారు. చీ ఇదేం వ్యాపారం. ఇలా సంపాదించి ఏడ తగలేసుకుంటరు. క్లిష్ట పరిస్థితుల్లో తోటి ప్రజలకు సాయ పడాల్సింది పోయి.. దోచుకుంటరా?. వ్యాపారులారా ఖబడ్దార్. మాకు మా సీఎం కేసీఆర్ అండగా ఉన్నారు.

ఇకపై కూరగాయల ధరలు పెంచడం, నిత్యావసరాల ధరలు పెంచి ప్రజల జేబులకు చిల్లులు పెట్టాలనే ఆలోచనలు ఉంటే ఇప్పుడే బందు పెట్టుకోండి. ఎందుకంటే ఇకపై ఒక్క కంప్లైంట్ వచ్చినా.. ఎక్కడ ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని తెలిసినా.. వ్యాపారుల్ని పీడీ యాక్ట్ మీద.. నేరుగా జైలుకు పంపడం జరుగుతుంది. అంతేకాదు ఆ ట్రేడర్స్ లైసెన్స్ రద్దు చేసి.. వారిని బ్లాక్ లిస్టులో పెట్టడం జరుగుతుంది. ఏం ప్రభుత్వం అంటే తమాషాగా ఉందా?. ఏం చేయరులే అనే ధైర్యమా?. సీఎం కేసీఆర్ మూడో కన్ను తెరిస్తే.. అక్రమాలకు పాల్పడే వ్యాపారులంతా జీవితాంతం జైలు గోడల మధ్య బతకాల్సి వస్తుంది. ఒంట్ల బయం పెట్టుకుని వ్యాపారం చెప్పండి. ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి.

వ్యాపారులారా తస్మాత్ జాగ్రత్త. అధిక రేట్లకు అమ్మితే.. ఇక జైలు ఊచలు లెక్కించాల్సింది వస్తుంది. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ మాట. కష్ట సమయంలో అంతా ఒక్కటిగా ఉండాలి. ఒకరినొకరు దోచుకు తినాలి అనుకుంటే.. మొన్న ఎర్రగడ్డలో జరిగిన లూటీ అంతటా జరుగుతుంది. అప్పుడు ప్రభుత్వం కూడా ఏం చేయలేదు. దయచేసి ప్రజల కడుపు కొట్టకండి. జనాన్ని ఇబ్బంది పెట్టకండి. ప్రభుత్వం చేస్తున్న అప్పీల్ ఇది. కాదు కూడదు అంటే ఆ లెక్క వేరే ఉంటది. ఇక మీ ఇష్టం. కేసీఆర్ కన్నెర్ర జేస్తే.. భస్మం అవ్వుడు తప్ప మీరు సాధించేది ఏమీ ఉండదు.