ఉస్మానియా కొత్త బిల్డింగ్​ను అడ్డుకున్నది మీరే..

 

  • ఉస్మానియా కొత్త బిల్డింగ్​ను అడ్డుకున్నది మీరే..
  • ఇప్పుడు బిల్డింగ్​ కట్టాలంటున్నదీ మీరే!
  • సిగ్గులేని నాయకులే ఇలా మాట్లాడుతారు…

ఉస్మానియాకు కొత్త బిల్డింగ్​ కడతామంటే.. నో నో.. చారిత్రక భవనం.. అది అలాగే ఉండాలి. జనం చచ్చినా ఫర్వాలేదని కాంగ్రెస్​, బీజేపీతోపాటు మరికొన్ని చిల్లర పార్టీలు గోల చేశాయి. నిన్న ఆస్పత్రిలోకి వర్షం నీళ్లు రాగానే ప్రభుత్వంపై నిందలు మోపడం మొదలుపెట్టాయి. అప్పుడు భవనం వద్దన్న వీళ్లే ఇపుడు కొత్త బిల్డింగ్​ ఎందుకు కట్టలేదని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్​ హామీని నిలబెట్టుకోలేదని బీజేపీ నాయకుడు వివేక్​ చేసిన విమర్శలే ఇందుకు నిదర్శనం. ఇలాంటి విమర్శలు చేసేముందు వీళ్లు గతాన్ని గుర్తుచేసుకోవాలి. కొత్త బిల్డింగ్​ కడదామన్నప్పుడు ఈ పార్టీలు హల్​చల్​ చేశాయి. ఇప్పుడు ప్లేటు ఫిరాయించి యూటర్న్​ తీసుకుంటున్నాయి.

దీనిని రాజకీయ వ్యభిచారం కాక ఏమంటారు ? వీళ్లకు ప్రజల ప్రాణాలంటే లెక్క లేదు. పేదోళ్లు చచ్చినా ఫర్వాలేదు కానీ తమ రాజకీయ లబ్ది కలిగితే చాలనే నీచులు. వీళ్లు ఏ స్థాయికి దిగజారారంటే.. శిథిలమైపోయిన ఉస్మానియా భవనాన్ని కూల్చితే.. బుల్డోజర్ల ముందు పడుకొంటామని ఏసీ గదులనుంచి స్టేట్‌మెంట్లిచ్చారు. విపక్షాలతో సహా వీళ్లలో ఏ ఒక్కరూ ఉస్మానియాను పరిరక్షించడం ఎట్లనో ఒక్క సలహా ఇవ్వలేదు. 1168 బెడ్‌లు ఉన్న అంత పెద్ద దవాఖాన భవనం దురదృష్టవశాత్తూ కూలిపోతే పరిస్థితి ఏమిటన్నది ఎవ రూ ఆలోచించలేదు.

మరమ్మతు చేసినా బాగుపడేస్థితిలో లేని దవాఖాన స్థానంలో ఆధునిక హంగులతో అద్భుత దవాఖాన నిర్మించి.. రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి నిస్సిగ్గుగా గండికొట్టారు. ఇవాళ అదే ఉస్మానియాలోకి పెద్ద ఎత్తున నీళ్లు వచ్చాయంటే.. రోగులు నానా ఇక్కట్లు పడ్డారంటే.. ఈ పాపం ఎవరిది? ఐదేండ్ల క్రితం కొత్త భవన నిర్మాణం ప్రారంభించి ఉంటే.. ఈ పాటికి అత్యద్భుతమైన నయా ఉస్మానియా దవాఖాన అందుబాటులోకి వచ్చి కరోనా ఆపత్కాలంలో ఆదుకొని ఉండేది కాదా? ఇవాళ మొసలి కన్నీళ్లు కారుస్తున్నవారు నాడు అడ్డుకొన్నందుకు ఏం జవాబు చెప్తారు?  ఉస్మానియా కొత్త భవనాన్ని అడ్డుకున్న విపక్ష నాయకులు ముక్కు నేలకు రాయాలి. గట్టిగా మాట్లాడితే.. వీళ్లపై కేసులు పెట్టినా పాపం లేదు. ఉస్మానియా దుస్థితికి నూటికి నూరుశాతం విపక్షాలే కారణం.