ఇవి సాధారణ బదిలీలే!

 

  • ఇవి సాధారణ బదిలీలే!
  • మన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ పటిష్టం

కుక్కకు బొక్క దొరికినట్టు వెలుగు పత్రికకు ఏఐఎస్​ అధికారుల బదిలీ వార్త ఒకటి దొరికింది. ప్రతి ఏటా చేసినట్టే ఈ ఏడాది కూడా ఐఏఎస్​ ఆఫీసర్లను బదిలీ చేశారు. ఇదొక సాధారణ వార్త. వెలుగు పత్రిక మాత్రం ఈ వార్తకు తన పైత్యాన్ని జోడించింది. ఏవేవో ఊహించుకొని పిచ్చిరాతలు రాసింది. రాష్ట్రంలో వైద్యారోగ్యశాఖ ప్రక్షాళనకే బదిలీలు చేశారంటూ పేద్ద కథ అల్లింది. వాస్తవం ఏమిటంటే వీరిలో చాలా మంది బదిలీలను కోరుకుంటున్నారు. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు వాళ్లు కోరుకున్నట్టే ప్రభుత్వమూ బదిలీ చేసింది. ఇందులోనూ చెడును వెతకడం వెలుగు పత్రిక మూర్ఖత్వానికి నిదర్శనం. వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా పనిచేస్తున్న శాంతికుమారిని బదిలీ చేసింది.

ఢిల్లీలో తెలంగాణ భవన్‌ ఓఎస్డీగా ఉన్న ముర్తుజారిజ్వీకి ఆ బాధ్యతలు అప్పగించింది. శాంతికుమారిని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. సాగునీటిపారుదల ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌ తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఎన్విరాన్‌మెంట్‌ సైన్స్‌అండ్‌ టెక్నాలజీ బాధ్యతలను అదనంగా చూడనున్నారు. కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌గాఉన్న యోగితారాణాను బదిలీచేసి ఆ స్థానంలో వాకాటి కరుణకు బాధ్యతలు అప్పగించారు.  మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ భారతి హోళికేరికి అదనంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ బాధ్యతలు అప్పగించారు.

ఇదే వార్తలో మరో అబద్ధాన్ని రాశారు. అదేంటంటే కరోనా విషయంలో ప్రజలు ప్రభుత్వంపై కోపంగా ఉన్నారట! ఈ విషయం ఇంటెలిజెన్స్​ వాళ్లకు తెలిసి ప్రభుత్వాన్ని హెచ్చరించారట. కరోనాను అద్భుతంగా కంట్రోల్​ చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. అన్ని టీచింగ్​ ఆస్పత్రులను కోవిడ్​ ఆస్పత్రులుగా మార్చారు. గచ్చిబౌలి టిమ్స్​ రెడీ అయింది. ఖాళీ బెడ్స్​ వివరాలను, కేసుల సంఖ్యను ఎప్పటికప్పుడు వెల్లడిస్తున్నారు. కరోనా రోగుల కోసం అత్యాధునిక మెడిసిన్స్​ వాడుతున్నారు. ఎంత ఖర్చుకైనా వెనుకాడటం లేదు. జిల్లా ఆస్పత్రుల్లోనూ కరోనా ట్రీట్​మెంట్స్​ మొదలయ్యాయి. కేంద్రం నుంచి నయాపైసా సాయం రాకపోయినా కేసీఆర్​ ప్రభుత్వం జంకడం లేదు. సో .. వెలుగు పత్రిక రాసింది ఒక చెత్త వార్త. జస్ట్​ ఏసీ రూమ్​లో కూర్చొని వండిన ఫేక్​స్టోరీ. దీనిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.