ప్రధాని ప్రసంగం.. గందరగోళం, అయోమయం

 

  • ప్రధాని ప్రసంగం.. గందరగోళం, అయోమయం
  • లాక్డౌన్​ పొడగింపుపై లేని స్పష్టత
  • మాటల గారడీ తప్ప ఒక్క విషయంలోనూ లేని క్లారిటీ

 

ప్రధాని ప్రసంగం కోసం మంగళవారం రాత్రి చాలా మంది ఎదురుచూసి చివరికి పెదవి విరిచారు. ఎనిమిదింటికి బడేమియా తెరపైకి వచ్చారు. మిత్రో.. అంటూ రాగం తీసి దాదాపు అర్థగంట మాటల గారడీ చేశారు. ఒక్క విషయంపైనా స్పష్టత లేదు.  ఆత్మనిర్భర్​ అంటూ అర్థం కాని పదాలు చాలా చెప్పారు. ఆత్మనిర్భర్​, ఆత్మవిశ్వాస్​, ఆత్మబలం అంటూ ఆత్మల భాషల మాట్లాడారు. రకరకాల సామెతలు, నుడికారాలు వాడారు. కరోనాకు మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతుందని చెప్పారు!! ? ఎలాగో మాత్రం వివరించలేకపోయారు.

కరోనా కట్టడిలో చాలా విజయాలు సాధించామన్నారు. ఆ విజయాలు ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉండగా, లాక్​డౌన్​ పొడగింపు అన్నారు. 4.0 లాక్​డౌన్​ సరికొత్తగా ఉంటుందన్నారు. అసలు ఇప్పుడే లాక్డౌన్​ లేనేలేదు. జనాలు ఇష్టమొచ్చినట్టు బయటికొస్తున్నారు. కేసులు పెరుగుతున్నాయి. ఇంకా సరికొత్త లాక్​డౌన్​ ఏంటో మోడీజీకే తెలియాలి. ఈయన ప్యాకేజీ అంటారు. తెల్లారి సిస్టర్​ నిర్మల క్లారిటీ ఇస్తే మాత్రం గుండెల్​ గుబేల్​మంటయ్​. ప్రతి దానికీ ఒక షరతు పెడతారు. ఫలానా లోన్ కావాలంటే చాలా అర్హతలు ఉండాలంటూ లిస్టు ముందు పెడతారు. ప్యాకేజీ గొప్పగా ఉంటుంది కానీ, దానిని అందుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని గత అనుభవాలు చెబుతున్నాయి.

నవ్వుల పాలయ్యారు..

ప్రధాని ప్రసంగం ముగిసిన వెంటనే ‘ఆత్మ నిర్భర్‌’కు అర్థం కోసం గూగుల్‌లో చాలా మంది వెతికారు. కర్ణాటక, తెలంగాణ వాసులు ఎక్కువగా శోధించినట్టు గూగుల్‌ ట్రెండ్స్‌ బట్టి వెల్లడైంది.  ‘ఆత్మ నిర్భర్‌’ అంటే అర్థం ఏంటో చెబుతూ నెటిజన్లు ఫన్నీ మీమ్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ‘ఆత్మ నిర్భర్’‌ అంటే ‘స్వయంగా వంట చేసుకోవడం’  ‘మన పని మనం చేసుకోవడం’  అంటూ కొంత మంది కామెంట్స్‌ చేయగా.. మరికొందరూ ‘కొడుకును ఓ తల్లి నువ్వు పెళ్లి ఎప్పడూ చేసుకుంటావ్‌ అని అడిగిన ప్రశ్నకు.. కొడుకు అమ్మ నేను అత్మనిర్భర్‌’ అని బదులు ఇచ్చినట్లుగా నెటిజన్లు ఫన్నీ మీమ్స్‌ షేర్‌ చేస్తున్నారు. అంటే ప్రజలు ఈ ప్రసంగాన్ని ఎంతో లైట్​ తీసుకున్నారో సులువుగానే అర్థం చేసుకోవచ్చు. ప్రధాని మాటల మనిషి తప్ప చేతల మనిషి కానేకాడు.