మర్యాద మరిచిన ఉత్తమ్.

 

  • మర్యాద మరిచిన ఉత్తమ్.
  • ప్రభుత్వ అధికారిక మీటింగులో కావాలనే గొడవ.
  • రుణమాఫీ 20వేల లోపు వాళ్లకు ఒకేసారి చేసింది.
  • లక్షలోపు వాళ్లకు 4 విడతలుగా చేస్తామన్నది సర్కార్.
  • అయినా.. రుణమాఫీ అంటూ లొల్లి దిగడం కరెక్టా?.
  • వ్యవసాయ సదస్సులో అసలీ టాపిక్ అవసరమా??.

కాంగ్రెస్ నాయకులు కావాలనే ప్రభుత్వం మీటింగుల్లో గొడవలకు దిగుతున్నారు. చిన్నచితక లీడర్లు అంటే ఏమో మర్యాద తెలియదు, ప్రొటోకాల్ తెలియదు అనుకుంటాం. కానీ.. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పనిచేసి, ఎంపీగా అయిన ఉత్తమ్ కూడా ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో మర్యాద మరిచాడు. ఏకంగా మంత్రిపైకే దూసుకెళ్లాడు. రైతు రుణమాఫీపై అసందర్భంగా మాట్లాడాడు. రుణమాఫీ గురించి ప్రశ్నించడానికి ఇదేమైనా అసెంబ్లీయా?. కొంచెమన్నా జ్ఞానం ఉండక్కర్లా?. సీనియర్ నాయకులు అనేది మాటల్లో కూడా చూపించాలి. గల్లీ లీడర్లలా వ్యవహరించడం కరెక్ట్ కాదు ఉత్తమ్.

అసెంబ్లీలో ప్రభుత్వం చర్చకు రమ్మంటే ప్రిపేర్ అవ్వలేదని పారిపోతారు. పబ్లిక్ మీటింగ్ లో మాత్రం.. అడ్డుతగులుతారా?. ఒక పీసీసీ ప్రెసిడెంట్, ఎంపీ అన్నప్పుడు ఎంత గౌరవంగా ఉండాలి. ప్రొటోకాల్ ప్రకారం.. జిల్లా కార్యక్రమంలో నిన్ను పిలిచారు. నియంత్రిత సాగు విధానంపై ప్రభుత్వ మీటింగ్ జరుగుతోంది. నువ్వు చెప్పాల్సింది చెప్పావ్. మరి మంత్రి చెప్పేటప్పుడు  వినాలి కదా?. అబ్బే.. వినం.. లొల్లి చేస్తామంటే ఎలా ఉత్తమ్. నీకే నోరుందనుకుంటున్నావా?. మంత్రి జగదీశ్ రెడ్డి నీకు కరెక్ట్ మొగుడు. స్టేజీ మీదే నువ్వెంత నీ లెక్కంత అంటూ చెడుగుడు ఆడుకుండు. ప్రజల ముందు ఇజ్జత్ తీసిండు. చాలదా ఇది.

ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే అసెంబ్లీలో చర్చించాలి. అంతేకానీ.. ఎక్కడపడితే అక్కడ లొల్లి చేస్తామంటే కుదరదు. అసందర్బంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూడటం.. పనికిమాలిన రాజకీయాలు చేయడంతోనే పదేళ్లు  ప్రతిపక్షానికే పరిమితం అయ్యారు. ఇంకా సిగ్గు రాకపోతే ఎలా ఉత్తమ్. గల్లీ లీడర్ గా వ్యవహరిస్తున్న నువ్వు పీసీసీగా ఉన్నన్ని రోజులు.. కాంగ్రెస్ పార్టీ నాశనం అవ్వుడు తప్ప.. బాగుపడేది ఏమీ ఉండదని తెలుసుకో. ఇప్పటికైనా బుద్ధి మార్చుకో ఉత్తమ్.