మానేరు నిర్వాసితులపై విపక్షాల మొసలికన్నీళ్లు.

 

  • మానేరు నిర్వాసితులపై విపక్షాల మొసలికన్నీళ్లు.
  • మిడ్ మానేరును 5 టీఎంసీల కెపాసిటీతో.. పదేళ్లపాటు నిర్మించలేదు.
  • భూసేకరణ చేసిన వారికి కనీసం పరిహారం కూడా చెల్లించలేదు.
  • నాడు కాంగ్రెస్ తో సీపీఐ కలిసి పనిచేసిందన్న విషయం మర్చిపోయావా చాడ.
  • మిడ్ మానేరు నేడు 25టీఎంసీలకు పెంచి.. అందరికీ పరిహారం ఇచ్చింది.
  • ఒకరిద్దరికి ఇవ్వలేదని ప్రభుత్వాన్ని విమర్శించడం కరెక్ట్ కాదు.

మిడ్ మానేరుపై విపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయి. గతంలో కేవలం 5టీఎంసీలతో ప్రాజెక్ట్ డిజైన్ చేసి..కనీసం పదిశాతం పనులు కూడా పూర్తి చేయలేదు.. కాంగ్రెస్ నాయకులు. హస్తం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కమ్యూనిస్టు  పార్టీ సీపీఐ వారితో కలిసి పనిచేసింది. కానీ.. నాడు ప్రాజెక్ట్ ఎందుకు పూర్తిచేయడం లేదు,..నిర్వాసితులకు  పరిహారం ఎందుకు ఇవ్వడం లేదని కామ్రేడ్లు ప్రశ్నించలేదు. కాంగ్రెస్  నాయకులు వేసే బిస్కెట్లు తింటూ కామ్ గా ఉన్నారు.

ఇప్పుడు అదే ప్రాజెక్ట్ ను.. 25 టీఎంసీలకు పెంచి.. గతంలో నిర్వాసితులందరికీ పరిహారం ఇచ్చింది. పరిహారం ఎక్కువ కావాలనిమొండికేసిన ఒకరిద్దరికి మాత్రమే పరిహారం ఇవ్వడంలో జాప్యం అవుతోంది. ప్రభుత్వం చట్ట ప్రకారం అందరికీ ఎలా పరిహారం ఇచ్చిందో.. వారికి కూడా ఇస్తుంది. అలా కాదని అంటే కోర్టులే నిర్ణయిస్తాయి. అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. కానీ.. విపక్షాలు, ముఖ్యంగా సీపీఐ నాయకులు మిడ్ మానేరు నిర్వాసితుల మీద మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. ప్రభుత్వం పరిహారం ఇవ్వనట్లు చేస్తున్నారు.

మిడ్ మానేరు భూసేకరణ జరిగింది కాంగ్రెస్ హయాంలో.. ఆ ప్రభుత్వం అందించాల్సింది ప్రస్తుత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎలా చాడ. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వంలో మీరు కూడా భాగస్వాములే. కాంగ్రెస్ నాయకులు చేసిన పాపం.. ఇప్పుడు టీఆర్ఎస్ మెడకు చుట్టుకుంది. గతంలో తక్కువ మొత్తంలో చెల్లించాల్సిన పరిహారం ఇప్పుడు డబుల్ అయింది. అయినా.. నిర్వాసితులు ఇంకా కావాలంటున్నారు. ప్రభుత్వం దగ్గర చెట్లకేమైనా డబ్బులు కాస్తున్నాయా?. ఒకవైపు మాంద్యంతో ఇబ్బంది పడుతుంటే.. మరోవైపు పరిహారం డబుల్ కావాలంటే ఎక్కడి నుంచి తేవాలి.