దండం పెట్టి చెప్పిన వినలే.. ఇక దండించుడే.

 

  • దండం పెట్టి చెప్పిన వినలే.. ఇక దండించుడే.
  • మంచిగ చెప్తే మన దగ్గర ఏడ వింటరు.
  • కేసీఆర్ సారు చెప్పిందే కరెక్ట్, చేసేదే రైట్.
  • పోలీసులకు ఫుల్ పవర్స్ ఇయ్యాల్సిందే.
  • షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ సైతం అమలు చేస్తమన్నరు.
  • బయటకు వెళ్తే తోలు తియ్యాల్సిందే.

అయ్యా, బాబు అని బుజ్జగించి చెప్తే వినలే. దండం పెట్టి చెప్పిన వినలే.. ఇక నుంచి దండన విధించుడే.. గట్టిగ దంచుడే. ఇవి ఈ రోజు ప్రెస్ మీట్ లో సీఎం కేసీఆర్ చెప్పిన అంశాలివి. పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. ఇకపై ఎవడైనా రోడ్డు మీద కనపడితే నడ్డి విరగదీయండని చెప్పారు. అత్యవసర సర్వీసులు, ఎమర్జెన్సీ ఉన్నవాళ్లకు మాత్రమే అనుమతించాలని ఆదేశించారు. మొన్నటికి మొన్న దండం పెట్టి చెప్తున్నమన్నరు. మన జనాలు వింటేనా?. గుంపులుగా వద్దంటే.. బండ్లేసుకుని రోడ్ల మీదకి వచ్చారు. పోలీసులతో గొడవలకు దిగారు.

కేసీఆర్ ఉగ్రనారసింహుడు అయితే ఎట్లుంటదో.. ఇక నుంచి జనం చూస్తారు. రోడ్డుమీద కనపడితే.. పోలీసులు తోలు తిరగలేస్తుంటే.. సీఎం దండం పెట్టి చెప్పిన విషయాలు మీకు గుర్తుకురావాలి. మంచిగ చెప్తే వినకుండా.. ఈ పరిస్థితి తెచ్చుకున్నారు. ఎవడి ఖర్మకు వాడే బాధ్యుడు. ప్రభుత్వం, అన్నిశాఖల అధికారులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది 24/7 రేయింభవళ్లు.. కరోనా నియంత్రించేందుకు కష్టపడుతుంటే.. జనం మాత్రం జల్సాల కోసం రోడ్ల మీదకు వస్తరా?. ఇకపై రాండి ఇగ. ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసులకు స్ట్రిక్టుగ ఆర్డర్స్ ఇచ్చిండు. మానవినకపోతే.. షూట్ ఎట్ సైట్ చేసేయండని చెప్పారు. అంటే కనిపిస్తే కాల్చివేత అన్నమాట.

కరోనా నియంత్రణకు ముఖ్యమంత్రి కేసీఆర్ సహా అధికార యంత్రాంగం అంతా నిద్రలేని రాత్రులు గడుపుతోంది. ఈ విషయం తలకమాసిన జనాలకు ఎప్పుడు అర్థం అవుతుంది. మంచిగ రోజంతా షాపులు తెరచే ఉంటాయి. ఇంటికి ఒకడు వచ్చి షాపింగ్ చేస్తే బాగుండదా?. బైకులు, కార్లు వేసుకుని రోడ్ల మీదకు గొడ్ల మంద లెక్క ఏంటికి రావాలి?. మీ ప్రాణాలకు ప్రమాదం అనే కదా హెచ్చరించేది?. రోజూ గొంతు చించుకుని చెప్తున్నా ఇళ్ల నుంచి ఏంటి బయటకు వస్తున్నారు. బాధ్యత అనేది ఉండక్కర్లేదా?. కడుపుకు అన్నమే కదా తినేది. ప్రభుత్వం పదే పదే ఎన్నిసార్లు చెప్తుంది. జనం ఇప్పటికైనా మారండి. ఇళ్ల నుంచి బయటకు వస్తే.. పోలీసులు తోలు తియ్యడం ఖాయం. ఫ్రెండ్లీ పోలీసింగ్, గిండ్లీ పోలీసింగ్ ఇక జాన్తానై. సర్కార్ ఆర్డర్స్ ఇకపై స్ట్రిక్టుగా అమలు అవుతాయి. మీకు అర్థం అవుతుందా?. మీ మట్టి బుర్రలకు ఎక్కుతుందా?.