కోటి ఎకరాల స్వప్నం అతి త్వరలోనే సాకారం.

 

  • కోటి ఎకరాల స్వప్నం అతి త్వరలోనే సాకారం.
  • వాయువేగంతో ప్రాజెక్టుల పూర్తి ప్రపంచంలో ఎక్కడా లేదు.
  • ఇరిగేషన్ మీద ఇన్ని డబ్బులు ఖర్చు చేసే ప్రభుత్వం ఎక్కడా లేదు.
  • రైతు కోసం ఎంత ఖర్చైనా పెట్టే నాయకుడు కూడా ఎక్కడా లేడు.
  • ఆరేళ్లలో సాగునీటికి శాశ్వత పరిష్కారం చూపారు సీఎం కేసీఆర్.
  • ఇరిగేషన్ శాఖలో ఆరేళ్లలో అద్భుతమైన ఫలితాలు సాధించింది.

ఒకప్పుడు కృష్ణా, గోదారి నీళ్ల కోసం అరిగోస పడ్డ ప్రాంతం. ఇప్పుడు నిండు వేసవిలోనూ ఎక్కడ చూసినా నీళ్లే కనిపించే ప్రాంతంగా మారింది. ఒకప్పుడు బీడు భూములు నేడు సిరులు కురిపించే పచ్చని మాగాణంలా మారాయి. ఒకప్పుడు నీళ్లు, కరెంటు లేక ఇబ్బందులు పడ్డ రైతాంగం.. నేడు ఆ బాధలు శాశ్వతంగా తొలగించుకుంది. వీటన్నింటికీ వెనకా ఒకే ఒక్కడున్నారు. ఆయనే సీఎం కేసీఆర్. తన విజన్ తో ఆరేళ్లలో రాష్ట్ర స్వరూపాన్నే మార్చిన ఘనుడు. ప్రపంచంలో ఏ నాయకుడికి సాధ్యం కాని విజయాల్ని అందుకున్నారు.

ఇరిగేషన్ శాఖపై లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిన ప్రభుత్వాలు బహుశా ఎక్కడా లేవని చెప్పొచ్చు. కాళేశ్వరం లాంటి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇంత పెద్ద ప్రాజెక్టును కేవలం నాలుగేళ్లలో పూర్తి చేయడం అంటే అసాధ్యం అంటున్నారు నిపుణులు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాయువేగంతో పనులు పూర్తి చేయించారు. 618 మీటర్ల ఎత్తుకు గోదారి నీళ్లను తీసుకురాగలిగారు. బంగారు తెలంగాణలో కీలక అడుగు వేయగలిగారు. నెర్రెలుబారిన నేలను తడిపి పచ్చని పంటలు పండించేందుకు మార్గం సుగమం చేశారు.

కోటి ఎకరాల మాగాణం స్వప్నం త్వరలోనే సాకారం చేయబోతున్నారు సీఎం కేసీఆర్. పెండింగ్ ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులు పూర్తి చేసి.. లక్షల ఎకరాలకు నీళ్లు అందించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. మిషన్ కాకతీయతో 12లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించిన కేసీఆర్.. కాళేశ్వరంతో మరో 36లక్షల ఎకరాలకు నీళ్లందించబోతున్నారు. ఇప్పటికే 50లక్షల ఎకరాల్లో రాష్ట్రంలో పంటల సాగు జరుగుతుండగా.. వీటికి అవసరమైన కరెంటు, సాగునీరు ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఫలితంగా లక్ష కోట్ల విలువైన పంటను పండించే స్థాయికి రైతాంగాన్ని చేర్చారు సీఎం కేసీఆర్. ఆరేళ్లలో ఇరిగేషన్ శాఖలో కనీవినీ ఎరుగుని రీతిలో పనులు చేసి చూపించారు.