కొండ‌పోచమ్మ‌పై సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక న‌జ‌ర్‌..

 

  • కొండ‌పోచమ్మ‌పై సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక న‌జ‌ర్‌..
  • గోదావ‌రి జ‌లాల త‌ర‌లింపుపై ప్ర‌త్యేక పూజ‌లు..
  • 29న స్వ‌యంగా హాజ‌రుకానున్న కేసీఆర్ దంప‌తులు..
  • ఇప్ప‌టికే ఎన్నో ఘ‌న‌త‌లు పూర్తి చేసుకున్న కాళేశ్వ‌రం..

 

ప్ర‌తిష్టాత్మ‌క కాళేశ్వ‌రం ప్రాజెక్టులో ముఖ్య ఘ‌ట్టానికి రంగం సిద్ధ‌మైంది. అత్యంత ఎత్తులో నిర్మించిన కొండ పోచమ్మ సాగ‌ర్ ప్రారంభానికి పూర్తి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ దీనిపై త‌ల‌మున‌క‌లై ఉన్నారు. దేశంతోపాటు ప్ర‌పంచ‌మే ఈ ఇంజ‌నీరింగ్ అద్భుతానికి క‌ళ్ల‌ప్ప‌గించి చూస్తూంటే, ఒక్కో ద‌శ‌ను పూర్తి చేసి ఇప్పుడు ఏడో ద‌శ వ‌ర‌కు కాళేశ్వరం త‌న న‌డ‌క‌ను కొన‌సాగించింది.

ఒక‌ప్పుడు ఎత్తుగ‌డ్డ‌మీదున్న తెలంగాణాల‌ను నీళ్లేలా వ‌స్తాయ‌న్న సీమాంధ్ర నాయ‌కుల హేల‌న‌కు ముతోడ్ జ‌వాబిచ్చేలా సీఎం కేసీఆర్ కాళేశ్వరాన్ని రీ డిజైన్ చేశారు. తాజాగా సిద్ధిపేట జిల్లాలోని గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గానికి గోదావారి నీళ్లు చేరుకోవ‌డం అంద‌రిలోనూ ఆనందాన్ని క‌లిగిస్తోంది. ఈ కొండ పోచ‌మ్మ సాగ‌ర్ ప్రారంభోత్స‌వంపై సీఎం కేసీఆర్ అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. చండీ, సుద‌ర్శ‌న‌యాగాల‌తో ఎలాంటి ముప్పు రాకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అలాగే ప్ర‌ముఖ ఆధ్యాత్మికవేత్త చిన్న జీయ‌ర్ స్వామి ఆశీస్సులు అందుకుని, చేసే పనిలో విజ‌యం చేకూరాల‌ని ఆశిస్తున్నారు. ఎవ‌రికీ సాధ్యం కాని రీతిలో ప్రాజెక్టుల నిర్మాణాన్ని త‌ల‌కెత్తుకున్నీ సీఎం కేసీఆర్‌.. రికార్డు స్థాయిలో పూర్తి చేస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు.

ఇక కాళేశ్వ‌రం ప్రాజెక్టుతో తెలంగాణ రూపురేఖ‌లే మారిపోయిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే వ్య‌వ‌సాయ‌రంగంలో తెలంగాణ అన్న‌పూర్ణలా మారింది. వివిధ పంటల విస్తీర్ణం అనూహ్యంగా పెరిగి అంద‌రి దృష్టి తెలంగాణ‌పై ప‌డే విధంగా మారింది. ఇప్ప‌టికే భారత ఆహార సంస్థ తెలంగాణాలో అత్య‌ధికంగా వ‌డ్ల సేక‌ర‌ణ జ‌రిగింద‌ని ప్ర‌శంసించింది. ఇలాంటి ఎన్నో ఘ‌న‌త‌లు సీఎం కేసీఆర్ వ‌ల్ల విన‌డం నిత్య‌కృత్యంగా మారిపోయింది. రేపు కాళేశ్వ‌రం పూర్త‌యి అందుబాటులోకి వ‌స్తే దేశంలోనే గాకుండా తెలంగాణ మ‌రిన్ని రికార్డుల‌ను నెల‌కొల్ప‌డం ఖాయం. జై కేసీఆర్‌.. జైజై కేసీఆర్‌..