సరిలేరు కేసీఆర్ కు ఎవ్వరు.

 

  •  సరిలేరు కేసీఆర్ కు ఎవ్వరు.
  • వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు అండగా కేసీఆర్.
  • సీఎం గిఫ్ట్ కింద సాయం ప్రకటించిన కేసీఆర్.
  • కష్టకాలంలో సేవ చేస్తున్నందుకు చిన్న  బహుమానం.
  • భవిష్యత్ లో మరింత ఆదుకుంటామని భరోసా.
  • ఏమైనా మా సీఎం భోళా శంకరుడే..

అడగకుండానే వరాలిచ్చే దేవుడు కేసీఆర్. కష్టంలో సాయపడ్డ వారిని కడుపున పెట్టుకుని చూసుకోవడం కేసీఆర్ కు తప్ప ఏ నాయకుడికి సాధ్యం కాదు. ఉద్యమ సమయంలో పాల్గొన్న వారిని ఏ విధంగా ఆదుకున్నారో.. ఇప్పుడు విపత్కర కాలంలో ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది, డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు, స్వీపర్లు, అటెండర్లు అందరికీ చేతులెత్తి నమస్కరించిన గొప్ప సంస్కారం కలిగిన నాయకుడు బహుశా కేసీఆర్ తప్ప ఎవ్వరూ లేరు. సఫాయన్న సలాం అన్న అంటూ నినదించిన ఏకైక నాయకుడు కూడా కేసీఆరే.

దేశం మొత్తం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే.. కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే.. సీఎం కేసీఆర్ మాత్రం కష్టంలో కన్నీళ్లను పంచుకుంటున్న వారికి భోళా శంకరుడు అయ్యారు. వైద్య సిబ్బందికి డాక్టర్ల నుంచి స్వీపర్ వరకు వారి జీతంలో 10శాతం సీఎం గిఫ్ట్ గా అందించాలని నిర్ణయించారు.. వెంటనే ఇవ్వాలని ఆదేశించారు. ఇక సఫాయి కార్మికులకు సలాం చెప్పిన కేసీఆర్.. వారికి కూడా ప్రత్యేక సాయం ప్రకటించారు. జీహెచ్ఎంసీ, HMWS కార్మికులకు 7,500, మున్సిపాలిటీలు, పంచాయతీల్లో పనిచేసే కార్మికులకు 5వేల రూపాయలు సీఎం గిఫ్ట్ కింద అందించాలని ఆదేశించారు. అలాగే.. చిన్న పొరపాటు వల్ల పారిశుధ్య కార్మికులకు కట్ చేసిన 10శాతం జీతం వెంటనే అందించేందుకు నిర్ణయించారు. కేసీఆర్ మనసు వెన్న అనడానికి ఇతకంటే నిదర్శనం ఏం కావాలి.

సీఎం కేసీఆర్ ఎప్పటికీ కష్ట పడ్డ వారికి తగిన ఫలితం దక్కేలా చూస్తారు. ఎంతటి కష్టంలో అయినా అందరికీ అండగా ఉంటారు. వైద్య సిబ్బంది,.. పారిశుధ్య కార్మికుల్లారా డోంట్ వర్రీ. మీ వెంట సీఎం కేసీఆర్ ఉన్నారు. పెద్దన్నగా మీకు చేదోడు, వాదోడుగా ఉంటారు. మీ అవసరాలను తీరుస్తారు. మీ సేవను గౌరవిస్తారు. ఇటువంటి ముఖ్యమంత్రి ఉండటం నిజంగా మన అదృష్టం. పూర్వ జన్మ సుకృతం