మైనారిటీల ఆశాదీపం కేసీఆర్​ సర్కారు

 

మైనారిటీల ఆశాదీపం కేసీఆర్​ సర్కారు

  • -రెండేండ్లలో రికార్డు స్థాయిలో 204 మైనారిటీ గురుకులాలు
  • -మైనారిటీ బడ్జెట్ పద్దు ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
  • -రూ.2 వేల కోట్ల మైనారిటీ బడ్జెట్ పద్దుకు అసెంబ్లీ ఆమోదం

 

బహుశా రెండుమూడేళ్ల క్రితం కావొచ్చు..ఒమన్ దేశ రాజు కుమారుడు హిషం అల్‌షాన్‌ఫరి హైదరాబాద్​ వచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణలో మైనార్టీ సంక్షేమంకోసం అమలుచేస్తున్న పథకాల గురించి తెలుసుకొని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఇండియాలో మైనారిటీలపై వేధింపులు ఉంటాయని మీడియాలో చదివిన ఆయన ఒక కొత్త రాష్ట్రం మైనారిటీల కోసం ఇన్ని మంచి పనులు చేస్తుందని తెలుసుకొని ఎంతో సంతోషించారు.  హర్ ఫర్జ్ పడేగా- ఘర్ ఘర్ బడేగా (ప్రతివాడు చదివితే- ప్రతి ఇంట్లో అభివృద్ధి వస్తుంది).. నిరక్షరాస్యత ఎక్కువగా ఉండే మైనారిటీ కుటుంబాల్లో విద్యాకాంతులు తీసుకువచ్చేందుకు రూపొందించిన నినాదమిది. ఇప్పటివరకు హాస్టళ్ల విద్య అలవాటులేని ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కుల పిల్లలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన మైనారిటీ గురుకులాలవైపు పెద్దఎత్తున ఆకర్షితులవుతున్నారు. ముస్లిం కుటుంబాల్లో బాలికలను హాస్టళ్లలో చేర్పించడానికి వారి తల్లిదండ్రులు ఏమాత్రం మొగ్గుచూపేవారు కాదు. అవసరమైతే చదువును మాన్పించేవారు. దీంతో ముస్లిం సమాజంలో రోజురోజుకు నిరక్షరాస్యత పెరిగిపోతూ ఆందోళన కలిగించే పరిణామంగా తయారైంది. ఈ సమస్యను అధిగమించడానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషి ఇప్పుడు సత్ఫలితాలు ఇస్తున్నది. ముస్లింలలో నిరక్షరాస్యతను దూరంచేసి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే సంకల్పం, పట్టుదలతో ముఖ్యమంత్రి కేసీఆర్​ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటుచేశారు. కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్య, వసతి, భోజనం, ఉచితంగా ఇతర సౌకర్యాలు కల్పించి ముస్లిం బాలబాలికలను గురుకులాలబాట పట్టించారు. 2016-17, 2017-18 విద్యాసంవత్సరాల్లో రాష్ట్రంలో మొత్తం 204 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు, రెండు రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేశారు. వీటిల్లో చదివే ఒక్కొక్క విద్యార్థిపై ప్రభుత్వం రూ.80 వేల వరకు ఖర్చుపెడుతున్నది. గురుకులాలు ఏర్పాటైన తొలి ఏడాది 2016-17లో 18వేల మంది గురుకులాల్లో చేరగా.. అందులో ఆరువేల మంది బాలికలు అడ్మిషన్లు తీసుకున్నారు. రెండో ఏడాది మొత్తం 48 వేల మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారు.

ఇదొక రికార్డు

రెండేండ్లలో 204 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లను రికార్డుస్థాయిలో నెలకొల్పింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడేండ్లలో మైనారిటీలకు చేసిన బడ్జెట్ కేటాయింపులు, చేపడుతున్న కార్యక్రమాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధిని మైనారిటీలు ఇప్పటివరకు ఊహించి ఉండరని ఇతర పార్టీల నాయకులు కూడా అంగీకరిస్తారు.  ఇలాంటి కార్యక్రమాలు దేశంలో మరే రాష్ట్రంలో అమలు కావడం లేదు. ఏటేటా సీఎం మైనారిటీల బడ్జెట్‌ను పెంచుతూ వస్తున్నారు. గతంలో కోటి రూపాయలున్న బడ్జెట్‌ను గత ఏడాది రెండు వేల కోట్లకు పెంచారు. పెద్ద రాష్ర్టాలు, 25 శాతానికి పైగా ముస్లిం జనాభా ఉన్న రాష్ర్టాల్లో కూడా తెలంగాణ తరహాలో మైనారిటీల సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులు జరగడం లేదు. మైనారిటీల విద్యపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి మైనారిటీల రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. గత సంవత్సరంలో రూ.248 కోట్లు, ఇప్పుడు రూ.735 కోట్లు కేటాయించారంటే సీఎం మైనారిటీ విద్యకు ఎంత ప్రాధాన్యమి స్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే.. మతఘర్షణలు జరుగుతాయని, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని రెచ్చగొట్టారు. ఇప్పుడు రాష్ట్రంలో గంగా-జమునా సంగమం కనిపిస్తుంది. అన్ని మతాల ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారు.

ఎన్నో సంక్షేమ కార్యక్రమాఉల

ఉర్ధూ భాషను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉర్ధూ అకాడమీకి రూ.40 కోట్ల నిధులు కేటాయించింది. 45వేల ఎకరాల వక్ఫ్‌భూములను రెవిన్యూ రికార్డులో వక్ఫ్‌భూములుగా నమోదుచేసింది. వక్ఫ్‌బోర్డుకు ప్రభుత్వం రూ.80 కోట్ల నిధులు కేటాయించింది. మైనారిటీలను పారిశ్రామికరంగం వైపు ప్రోత్సహించే ఉద్దేశంతో టీ-ప్రైమ్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. అంతర్జాతీయ ఇస్లామిక్ కల్చరల్ సెంటర్‌కు 10 ఎకరాల స్థలాన్ని కేటాయించింది.  రూ.7 కోట్లతో సిక్కుభవన్, క్రిస్టియన్‌భవన్, జామేనిజామియాలో రూ.14.60 కోట్లతో అధునాతన ఆడిటోరియం నిర్మిస్తున్నది.  గతంలో కుటుంబ నియంత్రణకు డబులిచ్చేవారు.ఇప్పుడు పిల్లలు పుడితే ప్రభుత్వం డబ్బులిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ఒక్కటే.