ఆదర్శంగా నిలుస్తున్న గజ్వేల్ రైతులు.

 

  • ఆదర్శంగా నిలుస్తున్న గజ్వేల్ రైతులు.
  • నియంత్రిత సాగుకు జై కొడుతూ గ్రామాల్లో తీర్మానాలు.
  • ప్రభుత్వం చెప్పిన పంటలే వేస్తామంటున్న రైతులు.
  • మక్క వేయడం ద్వారా నష్టమే తప్ప లాభం లేదని వెల్లడి.
  • పంటల మార్పిడితో తమకే లాభం అంటున్న అన్నదాత.

నియంత్రిత సాగు విధానానికి రైతులు జై కొడుతున్నారు. పంటల మార్పిడి ద్వారా తమకే లాభం చేకూరుతుందని.. ప్రభుత్వం చెప్పిన పంటలే సాగు చేస్తామని సంతోషంగా చెప్తున్నారు. గ్రామగ్రామాన తీర్మానాలు చేసి మరీ ప్రభుత్వానికి పంపుతున్నారు. ఇందుకు గజ్వేల్ నియోజకవర్గ రైతులు ముందు వరుసలో ఉన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో నియంత్రిత సాగు విధానానికి అనుకూలంగా తీర్మానాలు చేశారు. ప్రభుత్వం చెప్పిన పంటలే వేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నారు.

ఈ వానాకాలం నుంచే సాగులో సంస్కరణల శకం మొదలు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. డిమాండ్ ఉన్న పంటలే సాగు చేయించాలని… తద్వారా రైతును రాజుగా చేసే మార్గం ఉందని ప్రభుత్వం ఆలోచించింది. సేద్యాన్ని పండుగ చేసేందుకు స్వల్ప, దీర్ఘకాలిక వ్యూహాలతో ముందడుగు వేస్తోంది ప్రభుత్వం. క్లస్టర్ల వారీగా పంటల సాగు నిర్ణయించి.. డిమాండ్ ను బట్టి పంటలు వేసేందుకు వ్యూహం సిద్ధం చేశారు. పంటల కాలనీల ద్వారా.. సరికొత్త విప్లవం సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆలోచన విధానాన్ని అర్థం చేసుకున్న తెలంగాణ రైతాంగం.. కేసీఆర్ చెప్పినట్లే పంటలేస్తామని చెప్తోంది.

విపక్షాలు, సాగు విధానం తెలియని మూర్ఖులు పంటల మార్పిడిని వ్యతిరేకిస్తున్నా.. మెజార్టీ రైతాంగం ప్రభుత్వం చెప్పింది చేసేందుకు సిద్దమైంది. దీంతో.. ఈ వానాకాలం నుంచే తెలంగాణ సాగు విధానంలో నూతన శకం ప్రారంభం కానుంది. హరిత విప్లవం తెచ్చేందుకు ప్రభుత్వం చేసిన ప్రణాళిక సక్సెస్ అయితే.. ప్రపంచం మొత్తం మన దగ్గర పాఠాలు నేర్చుకునే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ ఆలోచనలు మున్ముందు ప్రపంచ వ్యవసాయ విధానంలో సరికొత్త మార్పులు తీసుకురానున్నాయి.