దీక్ష చేసిన కాంగ్రెసోళ్ల‌ను అరెస్టు చేయాలి

 

  • దీక్ష చేసిన కాంగ్రెసోళ్ల‌ను అరెస్టు చేయాలి
  • ప్రాజెక్టులు క‌డితే అడ్డుపుల్ల వేసేది వీరే..
  • క‌ట్ట‌కంటే దీక్ష‌లు చేసేది వీళ్లే…
  • పోతిరెడ్డిపాడు.. వీళ్ల పాడుప‌నే..
  • కాంగ్రెస్ నాయ‌కుల‌వి డ్రామాలు

కరోనా కాలంలో ప్రాజెక్టులు కట్టడం ఏంటని ప్రశ్నించేది కాంగ్రెస్ నాయకులే! కొండపోచమ్మసాగర్కు నీళ్లొస్తే ఏడ్చేది వీళ్లే. మన తెలంగాణ నీళ్లను దోచుకోవడానికి కట్టిన పోతిరెడ్డిపాడుకు హారతులు పట్టింది వీళ్లే! ఇప్పుడే ఈ సన్నాసులే ప్రాజెక్టులు పూర్తి చేయాలంటూ దొంగ దీక్ష చేశారు. పోతిరెడ్డిపాడును అడ్డుకోవాలంటూ డ్రామాలు ఆడుతున్నారు.

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలనే డిమాండ్‌తో కాంగ్రెస్‌ పార్టీ మంగళవారం చేసిన‌ జలదీక్ష ఒక‌ పెద్ద డ్రామా. ఇది కేవ‌లం ఒక పొలిటిక‌ల్ గిమ్మిక్ త‌ప్ప ఏమీ కాదు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. నల్లగొండ జిల్లాలో టీపీసీసీ చీఫ్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలను, కొడంగల్‌లో కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి, పరిగిలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు. సాయంత్రం 5 గంటల తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు.

నిజానికి వీరందరిపై కేసులు పెట్టి జైల్లో వేయాలి ఎందుకంటే కాళేశ్వరం, మిషన్ భగీరథ, సీతారామ, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులను నిర్మించకుండా కాంగ్రెసోళ్లు కోర్టుల్లో కేసులు వేశారు. దొంగ ఉద్యమాలు చేశారు. నిర్వాసితులకు ప్యాకేజీ రాకుండా అడ్డుకున్నారు. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ వెడల్పును కేసీఆర్ ప్రభుత్వం విజయవంతంగా అడ్డుకోగలిగింది. ఈ ప్రాజెక్టును ఆపాలంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీ సర్కారుకు ఆదేశాలు అందాయి. అయినా వీళ్లకు ఇంకా ఏం కావాలి ? ‌మిష‌న్ భ‌గీర‌థ‌తో ప్ర‌తి ఇంటికి నీళ్లొస్తున్న‌య్‌.

ప్రాజెక్టుల వ‌ల్ల పొలాల‌న్నీ స‌శ్య‌శ్యామ‌లం అవుతున్నాయి. మ‌రిన్ని ప్రాజెక్టులు క‌డ‌దామంటే కాంగ్రెసోళ్లే ఫిర్యాదు చేస్తూ అడ్డుకుంటున్న‌రు. మోడీ ప్ర‌భుత్వం నుంచి న‌యాపైసా సాయం రావ‌డం లేదు. అయినా అప్పోస‌ప్పో చేసి ప్రాజెక్టులు క‌డుతుంటే కాంగ్రెస్ దొంగ ఉద్య‌మాలు చేస్తోంది. అబ‌ద్ధాల‌తో, దొంగ‌దీక్ష‌ల‌తో ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్న కాంగ్రెస్ నాయ‌కుల‌పై త‌క్ష‌ణం కేసులు పెట్టి జైలుకు పంపాలి. లేక‌పోతే ఇలాంటి డ్రామాలు ఇక ముందూ కొన‌సాగుతాయి.