పనికిమాలిన సీఏఏ చట్టాన్ని చేసి దాన్ని స‌మ‌ర్థించుకునేందుకు బిజెపి తంటాలు…

 

 

  • ఈ అల్లర్లలో బీజేపీ నేతల ప్ర‌మేయం స్పష్టంగా కనిపించింది…
  •  పనికిమాలిన సీఏఏ చట్టాన్ని చేసి దాన్ని స‌మ‌ర్థించుకునేందుకు బిజెపి తంటాలు…
  • ఇప్పటికైనా చట్టాన్ని ఉపసంహరించుకోవాలని విశ్లేషకుల డిమాండ్…

పచ్చగా ఉన్న భారతదేశంలో అనవసరంగా తేనేతుట్ట‌ను కదిపి ఇప్పుడు ఏంజాయ్‌ చేస్తుంది ఈ భారతీయ జనతా పార్టీ. పౌరసత్వ సవరణ చట్టం పేరుతో దిక్కుమాలిన చట్టాన్ని చేసి ఇప్పుడు దేశం తగలబడుతుంటే నీరో చక్రవర్తిలాగా ఫిడేలు వాయించుకుంటూ అటూ ఇటూ తిరుగుతోంది. గత ఆరేళ్లలో భారతీయ జనతా పార్టీ పాల‌న‌లో భారత దేశం వందల ఏళ్ళ వెనక్కి వెళ్లిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక ఢిల్లీ అల్లర్ల విషయానికి వస్తే అక్కడ కేంద్ర ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దేశ రాజధాని అయిన ఢిల్లీ పేరును కేంద్ర ప్రభుత్వం చెడగొడుతుంది అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎఏకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిని కావాలనే, రెచ్చగొట్టేలా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తాము చేసిన పిచ్చి చట్టాన్ని సమర్పించుకునే ఎందుకు బిజెపి తంటాలు పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ అల్లర్లకు కారణం అయిందని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

తెలంగాణలోని భారతీయ జనతా పార్టీ నేతలు ముఖ్యంగా లక్ష్మణ్ లాంటి వాళ్ళు రాజకీయ బ‌ఫూన్ల‌లాగా మాట్లాడుతున్నారు. సీఏఏ చట్టాన్ని సమర్థించ‌డం కోసం రకరకాల గారడి విద్యలు ప్రదర్శిస్తున్నాడు. ఎవరేం చేసినా కూడా  దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం పై అందరిలో భయం నెలకొని ఉంది. వీళ్లు చేసిన తలకాయలేని పనికి దేశంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఒక మెట్టు దిగి ఈ చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొంటే బాగుంటుందని విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. లేకుంటే రాబోయే రోజుల్లో దేశమంతా రావణకాష్టంలా సాగనుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏదేమైనా వరుసగా రెండు సార్లు మెజారిటీ నుంచి కేంద్రంలో ప్రభుత్వాన్ని అందిస్తే భారతీయ జనతా పార్టీ ఈ విధంగా ప్రవర్తించడం సిగ్గుచేటని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా పాలనలోనే వైఫల్యాలను సరిదిద్దుకొని చ‌క్క‌ని పరిపాలన అందించాలని హితవు పలుకుతున్నారు