కరోనా వ్యాక్సిన్ కేరాఫ్ అడ్రస్ తెలంగాణ…

 

  • కరోనా వ్యాక్సిన్ కేరాఫ్ అడ్రస్ తెలంగాణ…
  • హైదరాబాద్ లో వ్యాక్సిన్ ఉత్పత్తి పై కొనసాగుతున్న ప్రయత్నాలు…
  • ఆగస్టులో కెల్లా అందుబాటులోకి వ్యాక్సిన్…
  • సీఎం కేసీఆర్ కృషితోనే ఫార్మా రంగంలో నెంబర్ వ‌న్‌గా తెలంగాణ…

ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రమాదకరమైన క‌రోనా వైరస్ ను అరికట్టడానికి త్వరలోనే తెలంగాణ నుంచి శుభవార్త అందే అవకాశం ఉంది. కరుణ వైరస్కు సంబంధించిన వ్యాక్సిన్ పరీక్షలు తెలంగాణలోనే జరుగుతున్నట్లు తాజాగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలిపారు. రాజధాని నగరంలోని జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ కు సంబంధించిన పరీక్షలను విస్తృత స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఆగస్టు లేదా సెప్టెంబర్ వరకు కల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి ప్రమాదకర వైరస్ ను తరిమి కొట్టే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ విషయమై ఇప్పటికే ప్రముఖ ఫార్మా కంపెనీ అధినేతల‌తో చర్చించినట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. క‌రోనా వ్యాక్సిన్‌ భాగ్యనగరంలో కనిపెడితే తెలంగాణ శక్తియుక్తులు ప్రపంచానికి చాటి చెప్పినట్లవుతుంది. ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలు వ్యాక్సిన్‌పై తలకిందులు అవుతుంటే హైదరాబాద్ లో మాత్రం ఆ కరుణ వ్యాక్సిన్ ను ఏర్పాటు చేయడం మనందరికీ ఎంతో గర్వకారణం.
తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యల వల్లే హైదరాబాద్ లో ఫార్మా రంగం వేగంగా విస్తరిస్తోంది. ప్ర‌మాద‌క‌ర‌ వైరస్ వ్యాక్సిన్ కూడా క‌నుకుంటే మన రాష్ట్రము పరువు ప్రతిష్ట ఇవి కాకుండా దేశం యొక్క ఘనత కూడా ప్రపంచానికి చాటి చెప్పినట్లవుతుంది. ఇక క‌రోనా కారణంగా బాధపడుతున్న వేరే దేశాలకు అతి చౌకగా వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఇప్పటికే అభివృద్ధితోపాటు సంక్షేమ లోనే దేశంలోనే నెంబర్వన్ గా నిలిచిన తెలంగాణ.. శాస్త్ర సాంకేతిక రంగాల్లో తనదైన మార్కును చూపెడుతోంది. ఒక్కసారి కరోనా వైరస్ మార్కెట్లోకి వస్తే మన శాస్త్రవేత్తల కృషి ప్రపంచానికి వెల్లడించినట్లు అవుతుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పినట్లు రాష్ట్రం బంగారు మయం అవుతుంది అనడానికి ఇవన్నీ సంకేతాలు. అతి త్వరలోనే రాష్ట్రం మరిన్ని ఘనతను తన పేరిట నిలుపుకొంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.