కరోనా వైరస్‌కు తెలంగాణ ప్రభుత్వం చెక్…

 

  • కరోనా వైరస్‌కు తెలంగాణ ప్రభుత్వం చెక్…
  • 31 వరకు రాష్ట్రాన్ని లాక్‌డౌన్‌గా ప్రకటించిన సీఎం కేసీఆర్…
  • ప్రజలు ఇబ్బంది పడకుండా ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ వర్గాలు…
  • ప్రభుత్వ చర్యలకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతగానో ఉంది…

 

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన వేళ‌ తెలంగాణ ప్రభుత్వం అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంది.  ఈ నెల 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ పాటిస్తున్నట్లు పేర్కొంది. తక్షణం ఇతర రాష్ట్రాల నుంచి సరిహద్దులను మూసి వేయడంతోపాటు, ప్రజా రవాణా స్తంబింప చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపింది. తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో కరోనా వైరస్ ఎదుర్కొనేందుకు తగిన చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ ప్రభుత్వానికి మనమందరం మద్దతుగా నిలవాల్సిన సమయం ఆసన్నమైంది. వైరస్ ఉధృతి తక్కువగా ఉన్నప్పుడే దాన్ని అడ్డుకునేందుకు ఆ వ్యాధి నుంచి పూర్తిగా మనం బయటపడదాం అని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టినా దానికి మనమంతా సంపూర్ణ విశ్వాసం ప్రకటించాల్సిన అవసరం ఉంది. కొన్ని రోజుల పాటు మన పనులను వాయిదా వేసి, త్వరగా వైరస్ ను అడ్డుకునేందుకు తగిన ఆ విధంగా ముందుకు నడవాల్సిన అవసరం ఉంది.

క‌రోనా వైరస్ను అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రకరకాల ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయనుంది. ప్రజలు ఇబ్బంది పడకుండా తెల్లరేషన్ కలిగిన వ్యక్తులకు ఒకరికి 12 కిలోల చొప్పున బియ్యాన్ని అందించనుంది. అలాగే ఒక్కో కుటుంబానికి 1500 రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక నిత్య అవసరాల కోసం ఇంటికి నుంచి ఒక్కరే బయటకు వెళ్లి తగిన పనులను చక్కబెట్టుకోవాలనే ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన అవసరం ప్రజలకు ఎంతగానో ఉంది. అప్పుడే ఈ మహమ్మారిని మన రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు, కావలసిన సాధన సంపత్తి సమకూరుతుందని తెలుస్తోంది. ఏదేమైనా క‌రోనా వైరస్పై అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వం.. తన ప్రత్యేకతను చాటుకుంది.