భయమొద్దు.. భరోసా ఉంది…

 

  • భయమొద్దు.. భరోసా ఉంది…
  • కాస్త జాగ్రత్తగా ఉండే చాలు
  • కరోనా నుంచి తప్పించుకోవచ్చు

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మాటలు జనానికి టానిక్​లా పనిచేస్తాయి అనడంల సందేహం లేదు. ఆయన ధైర్యం చెప్పే విధానం, హితవు చెప్పే పద్ధతి ఎవరినైనా ఆకట్టుకుంటాయి. ఆయన రాజకీయ నాయకుడే కాదు ఒక కౌన్సెలర్​ కూడా. మరో రకంగా చెప్పాలంటే కుటుంబ పెద్ద మాదిరి ఆప్యాయంగా మాట్లాడుతారు. ప్రస్తుతం జనంలో కరోనా మేనియా ఉన్న విషయం తెలియనిది కాదు. ఎక్కడ చూసినా ఇదే టాపిక్​. ఎవరిలో చూసినా ఆందోళన, భయం. అయితే మన రాష్ట్రంలో పరిస్థితి మరీ ఘోరంగా ఏమీ లేదని, నిశ్చింతంగా ఉండొచ్చని సీఎం కేసీఆర్​ ధైర్యం చెప్పారు. కరోనా బాధితులకు అండగా ఉంటామని, ఎవరూ కంగారు పడాల్సిన అవసరమే లేదని భరోసా ఇచ్చారు.

వ్యాధిని అడ్డుకోవడానికి శక్తివంచన లేకుండా కష్టపడతామని, వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, అదే సందర్భంలో నిర్లక్ష్యంగా కూడా ఉండవద్దని హెచ్చరించారు.  అన్నారు. కరోనా వైరస్ సోకినవారు అధికవ్యయం చేస్తూ ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎంతమందికైనా సేవలు అందించడానికి ప్రభుత్వ వైద్యశాలలు, వైద్యసిబ్బంది సంసిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. కరోనా వ్యాప్తి నివారణలో, చికిత్సలో ఎంతో గొప్ప సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతిభవన్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేశారు.

వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.    ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో, దేశంలోని అన్ని రాష్ర్టాల్లో ఉన్నది. కేవలం తెలంగాణలోనే లేదు.. తెలంగాణలోనేపుట్టలేదు. జాతీయ సగటుతో చూసుకుంటే రాష్ట్రంలో మరణాల రేటు తక్కువగా ఉన్నది. రాష్ట్రంలో రికవరీ రేటు చాలా ఎక్కువగా ఉన్నది. రాష్ట్రం లో గురువారం నాటికి దవాఖానల్లో ఉండి చికిత్స పొం దుతున్నవారు 3,692 మంది ఉన్నారు. వారిలో తీవ్రమైన ఇతర జబ్బులున్న 200 మంది తప్ప మిగతావా రంతా కోలుకుంటున్నారు. లక్షణాలు లేనప్పటికీ కొవిడ్ ప్రొటోకాల్ ప్రకారం.. వైరస్ సోకిన వారందరి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన గైడెన్స్ చికిత్స అందిస్తున్నారు. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా   కరోనాతో సహజీవనం చేయక తప్పని స్థితి వచ్చింది. అయితే కరోనా విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరీ అంత భయంకరమైన పరిస్థితి లేదు.

అదే సమయంలో ప్రజలు నిర్లక్ష్యంగా కూడా ఉండవద్దు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. మాస్కులు ధరించాలి. శానిటైజర్లు వాడాలి. వీలైనంత వరకు ఇండ్లలోనే ఉండాలి. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు, కరోనా సోకినవారికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభు త్వం సర్వన్నద్ధంగా ఉన్నది. కరోనాను ఎదుర్కొనే విషయంలో కేంద్ర ప్రభుత్వమే మొదట గందరగోళంలో ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కావాల్సినవన్నీ చాలా వేగంగా సమకూర్చుకున్నారు. ఇప్పుడు వేటికీ కొరతలేదు. హైదరాబాద్ గాంధీ, టిమ్స్ దాదాపు 3వేల బెడ్లు ఆక్సిజన్ సౌకర్యంతో సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్ సౌకర్యం కలిగిన 5 వేల బెడ్లను సిద్ధంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని హాస్పిటళ్లలో కలిపి 10 వేల బెడ్లను కేవలం కరోనా చికిత్సకోసమే ప్రత్యేకంగా కేటాయించారు. ఇన్ని బెడ్లు గతంలో ఎన్నడూ లేవు. 1500 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయి.

లక్షల సంఖ్యలో పీపీఈ కిట్లు, ఎన్95 మాస్కులు ఉన్నాయి. మందులు, ఇతర పరికరాల కొరత లేదు. ప్రభుత్వ వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది ఎంతో గొప్పగా సేవలు అందిస్తున్నారు. అవగాహన లేకుండా విపక్షాలు చేసే చిల్లర విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు.  ప్రజలు హైరానా పడి, అధిక వ్యయం చేస్తూ ప్రైవేటు దవాఖానలకు పోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ వైద్యశాలల్లో ఐసీఎమ్మార్ మార్గదర్శకాల ప్రకారం మంచి చికిత్స అందుతున్నది. ఎవరికి లక్షణాలు కనిపించినా వెంటనే సమీపంలోని దవాఖానలకు వెళ్లి, వైద్యుల సలహా తీసుకోవాలి. చికిత్స పొందాలి. తెలంగాణ రాష్ట్రంలో పీహెచ్ స్థాయి నుంచి అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో కరోనా విషయంలో కావాల్సిన వైద్యం అందించడానికి ఏర్పాట్లున్నాయి. కాబట్టి వీటిని ప్రజలు వినియోగించుకోవాలి. కరోనా వ్యాప్తి నివారణకు, వైరస్ సోకినవారికి మంచి వైద్యం అందించడానికి ప్రభుత్వం ఎంత ఖర్చయినా పెట్టడానికి సిద్ధంగా ఉన్నది.