కరోనా కథేంటి ?

 

కరోనా కథేంటి ?

క‌రోనా… చిన్నాపెద్దా లేకుండా ప్ర‌తి ఒక్క‌రినీ భ‌య‌పెడుతున్న మ‌హ‌మ్మారి ఇది. ఇప్ప‌టికే మ‌న‌దేశంలో దాదాపు 500 మంది ఈ వ్యాధి బారిన‌ప‌డ్డారు. ఇంకెంత‌మందిలో ఈ వైర‌స్‌లో ఉందో తెలియ‌దు. దాదాపు ఆరుగురు చ‌నిపోయారు. అందుకే ఇంట్లో ఉండండిరా నాయ‌న‌లారా.. బ‌య‌ట తిరిగి చావ‌కండి అని కేసీఆర్ ఎంత మొత్తుకున్నా జ‌నం విన‌డం లేదు. ఇష్ట‌మొచ్చిన‌ట్టు రోడ్ల‌పై తిరుగుతూ డేంజ‌ర్‌జోన్‌లోకి వెళ్తున్నారు. ఈ వ్యాధి ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో తెలియ‌క ఇలా చేస్తున్నారు. అందుకే దీని పుట్టుపూర్వోత్తరాలు, తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల గురించి కాస్త అవ‌గాహ‌న పెంచుకుందాం.

చైనాలోనే పుట్టుక‌…

చైనాలోని వుహాన్‌ పట్టణంలోని ‘సీ ఫుడ్‌’ మార్కెట్‌ నుంచి కరోనావైరస్‌ మానవులకు సంక్రమించినట్లు చైనా వైద్యాధికారులు ఇప్పటికే ధ్రువీకరించారు. అక్కడ ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో వారి శాంపిల్స్‌ను లండన్‌కు పంపించి పరిశోధనలు చేపట్టారు. దీంతో పరిశోధకులు వారికి కొత్త వైరస్‌ వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. దానికి కరోనా వైరస్‌ అని పేరు పెట్టారు. కరోనా అనేది లాటిన్‌ పదం. కరోనా అంటే కిరీటం అనే అర్థం వస్తుంది. కరోనా వైరస్‌ను ఎలక్ట్రానిక్‌ మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు ఆ సూక్ష్మ జీవులు రాజులు ధరించే కిరీటం ఆకృతిలో పరిశోధకులకు కనిపించాయి. దీంతో ఆ సూక్ష్మ జీవులకు కరోనా వైరస్‌ అని పేరు పెట్టారు.