సీఎం కేసీఆర్ కొత్త స్టైల్ సూపర్…

 

  • సీఎం కేసీఆర్ కొత్త స్టైల్ సూపర్…
  • చేనేత మాస్కు ధరించి అందరికీ ఆదర్శంగా నిలిచిన పెద్ద‌సారు…
  • ప్రజలంతా చేనేత వస్త్రాలు ధరిస్తే బాగుంటుంది…
  • అప్పుడే కార్మికుల్లో కొత్త వెలుగు ప్రవేశిస్తుంది.

తాజాగా జరిగిన మీడియా సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖర రావు అందరి దృష్టిని ఆకర్షించారు. మెడలో చేనేత కండువా ధరించి ఆయన చేనేత కార్మికులకు అండగా నిలిచారు. తరతరాలుగా నిరాదరణకు గురవుతున్న చేనేత కార్మికుల‌ను ఆదుకోవటానికి, వారి  అద్భుత సృష్టి అందరికి తెలిసేలా చేశారు. క‌రోనా వైరస్ కాలంలో అందరూ మాస్కులు ధ‌రి ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చేనేత వస్త్రాలు మాస్కుల రూపంలో ధరించేలా ఆయన రూప‌క‌ల్పన‌ చేశారు.

మాస్కూల‌ రూపంలో అందరూ చేనేత వ‌స్త్రాలు ధ‌రిస్తే కార్మికులు ఆర్థికంగా లాభపడతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేప‌థ్‌యంలో అంద‌రూ  కేసీఆర్ దారిలో న‌డ‌వాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అప్పుడే మనం చేనేత కార్మికులన ఆదుకోవడానికి ఈ రకంగా ముందుకు వెళ్లిన‌ట్లు అవుతుంది.

మరోవైపు గత ఆరేళ్ళుగా తెలంగాణ  ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం ఎంతగానో కృషి చేసింది. బతుకమ్మ చీరలు లాంటి అనేక పథకాలను చేపట్టి చేనేత కార్మికులకు పని కల్పించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు క‌రోనా వైర‌స్‌ సంక్షోభం సమయంలోనూ చేనేత కార్మికులకు సీఎం కేసీఆర్ మ‌రో ముందడుగు వేసేలా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు అందరు చేయటం చేనేత మాస్కుల‌ను ధరిస్తే బాగుంటుంది. కెసిఆర్ ముందడుగు ను స్పూర్తిగా తీసుకొని ఇక నుంచి అందరు కూడా చేనేత వస్త్రాలు ధరిస్తే బాగుంటుంది. ఇప్పుడే చేనేత కార్మికుల బ‌తుకుల్లో కొత్త వెలుగులు నిండుతాయి.