రైతుల‌కు ద్రోహం చేసే చెత్త వార్త‌లివి!

 

  • రైతుల‌కు ద్రోహం చేసే చెత్త వార్త‌లివి!
  • నియంత్రిత వ్య‌వ‌సాయ విధానంపై రోత రాత‌లు
  • ఇది రైతు వ్య‌తిరేక విధాన‌మంటూ అడ్డ‌గోలు విమ‌ర్శ‌లు

కేసీఆర్ ప్ర‌భుత్వం రైతుప‌క్ష‌పాతి అన్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఈ విష‌యంలో ఎవ‌రికీ ఎలాంటి సందేహాలూ ఉండ‌వు. మ‌న సీఎం స్వ‌యంగా రైతు కాబ‌ట్టి అన్న‌దాత క‌ష్ట‌సుఖాలేంటో తెలుసు. సంప్ర‌దాయ విధానంలో పంట‌లు సాగు చేసేవాళ్లు ఎన్న‌టికీ బాగుప‌డ‌ర‌ని, భూమిని, వాతావ‌ర‌ణాన్ని, మార్కెట్ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి పంట‌ల‌ను మార్చే వారే లాభ‌ప‌డ‌తార‌ని వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత్త‌లు ఘంటాప‌థంగా చెబుతున్నారు. అందుకే నియంత్రిత వ్యవసాయ విధానం తెచ్చారు. పంట మార్పిడి నిర్ణ‌యం కేసీఆర్ త‌న ఇంట్లో కూర్చొని తీసుకోలేదు.

సైంటిస్టుల సూచ‌న మేర‌కే పంట‌ల‌ను మార్చాల‌ని చెబుతున్నారు. రైతుల‌ను సంప‌న్నుల‌ను చేయ‌డం ఆయ‌న ల‌క్ష్యం. ఇంత మంచి ఆశ‌యానికి తూట్లు పొడిచేలా వెలుగు ప‌త్రిక రోత వార్త‌లు రాస్తున్నది. ఇలాంటి ప‌త్రిక‌ను ఏమ‌ని తిట్టాలి ? ఒక ప‌త్రిక రైతు పొట్ట‌గొట్టేలా వార్త‌లు రాయొచ్చా ? త‌న బాస్ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం మ‌రీ ఇంత దిగ‌జారాలా ? తెలంగాణ సోనా అనే కొత్త విత్తనాన్ని తెలంగాణ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనిలో షుగర్ స్థాయి తక్కువ ఉంటుందని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. ఇలాంటి వంగడాలకు ఇంటర్నేషనల్గా డిమాండ్ ఉంది. పత్తికి డిమాండ్ పెరిగింది.

అందుకే ఇలాంటి పంటలు వేయాలని సూచిస్తున్నారు. వరితో పోలిస్తే పత్తి పండించిన రైతు రెట్టింపు ఆదాయం సంపాదించవచ్చు. వరిలోనూ కొన్ని వంగడాలను ఎంచుకుంటే ఆదాయం పెరుగుతుంది. దేశంలో ది బెస్ట్‌ కాటన్‌ తెలంగాణతోపాటు కేవలం విదర్భలో మాత్రమే పండుతుంది. ఈసారి రాష్ట్రంలో 70 లక్షల ఎకరాల్లో పత్తి పండించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పింది ఇందుకే. వానకాలంలో మొక్కజొన్న వేస్తే ఫాయిదా ఉండదు. బదులుగా కంది గానీ పత్తి గానీ వేసినోళ్లకు పైసల పంట పండుతుంది. మక్కజొన్న 25 క్వింటాళ్ల కంటే ఎక్కువ రాదు. కంది, పత్తి వేస్తే ఎక్కువ లాభం వస్తుంది. 15 లక్షల ఎకరాల్లో కందిపంట వేసినా ఆ పంటను మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ప్రభుత్వం ఇంత బాగా చెబుతున్నా వెలుగు వంటి పత్రికలు రైతుల్లో లేనిపోని భయాలను పెంచుతున్నాయి.