కేంద్ర ప్యాకేజీతో రైతుకు పైసా కూడా మేలు లేదు.

 

  • కేంద్ర ప్యాకేజీతో రైతుకు పైసా కూడా మేలు లేదు.
  • బడ్జెట్ లో కేటాయింపులు తీసుకొచ్చి ఆర్థిక ప్యాకేజీ అంటున్నారు.
  • జనం అంత వెర్రోళ్ల లెక్క కనపడుతున్నారా.. బీజేపీకి.
  • పేదలు, మధ్యతరగతి వాళ్లు, రైతులకు మీ ఆర్థికప్యాకేజీలో..
  • డైరెక్ట్ బెనిఫిట్ పొందే ఫెసిలిటీ అనేది ఉందా బండి సంజయ్.
  • ఏమన్నా అంటే రుణ సదుపాయం అంటున్నారు.
  • అసలే ఉపాధి లేక ఏడుస్తుంటే.. రుణాలు ఇచ్చి వడ్డీలు కట్టమంటే…
  • ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలి బీజేపీ నాయకుల్లారా??.

కేంద్ర ఆర్థిక ప్యాకేజీ వల్ల సామాన్య ప్రజలకు ఒరిగేదీ ఏమీ లేదు. కేవలం వ్యాపారులకు మాత్రమే కొంత మేలు జరుగుతుంది. పేదలు, మధ్య తరగతి ప్రజలు, ముఖ్యంగా రైతులకు బెనిఫిట్ అనేది ఎంతమాత్రం లేదు. పైగా కేంద్రం ప్రకటించిన 20లక్షల కోట్ల ప్యాకేజీలో కేవలం బడ్జెట్ లో కేటాయింపులే ఉన్నాయి తప్ప.. ఇంత కష్ట సమయంలో ప్రజలకు కొత్తగా ఇన్ని పైసలు ఇస్తున్నామనేది ఏమీ లేదు. జీడీపీలో 10శాతం ఇస్తున్నామని.. బీజేపీ నాయకులు డంబాచారం కొట్టుకోవడం తప్ప.. కేంద్ర ఆర్థిక ప్యాకేజీతో ఎవ్వరికీ మేలు జరిగే పరిస్థితి లేదు.

కేంద్రం చిన్న వ్యాపారులకు మేలు చేసినా.. అది కూడా రుణం రూపేనా అందిస్తోంది. అంటే కేంద్రం ఇచ్చింది వడ్డీతో సహా ముక్కు పిండి వసూలు చేస్తుంది. సో… విపత్కర సమయంలో కేంద్రం డైరెక్ట్ గా ప్రజలకు అందించింది గుండు సున్నా అనేది స్పష్టంగా తెలుస్తోంది. ఆ నిర్మలా సీతారామన్.. బడ్జెట్ లెక్కలు మళ్లీ వచ్చి చెప్పేందుకు ఎందుకు టైమ్ వేస్ట్. జనానికి ఉపయోగపడకుండా.. అది చేస్తాం,. ఇది చేస్తాం అని గొప్పలు చెప్పుకోవడం దేనికి. మనకన్నా చిన్న దేశాలు వాళ్ల ప్రజల కోసం ఆయా దేశాల జీడీపీలో 20 నుంచి 60శాతం వరకు ఖర్చు చేస్తున్నాయి. గొప్ప దేశం అని చెప్పుకునే మన దగ్గర మాత్రం 10శాతమే అది కూడా బడ్జెట్ ఖర్చులే. కొత్తగా కేటాయింపులు సున్నా.

అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాల్లో ప్రతీ వ్యక్తికి లక్ష రూపాయలకు పైగా అందేలా చేశారు. కానీ.. అందులో పది పైసల వంతు కూడా భారత్ ప్రజలకు అందించలేకపోతోంది. ఇందుకు కాదా మనం వెనకబడి ఉండేది. కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీతో కనీసం రైతులకైనా మేలు జరుగుతుందేమో అనుకున్నాం. అదీ లేదు. కష్టకాలంలోనూ దేశంలో ఆహార నిల్వలు అయిపోకుండా రైతు పండిస్తేనే దేశ ప్రజలు తింటున్నారు. అటువంటి అన్నదాతను ఆదుకునేందుకు మాత్రం బీజేపీకి చేతులు రావడం లేదు. థూ మీ బతుకులు చెడ. మిస్టర్ బండి సంజయ్ నువ్వు గొప్పలు చెప్పడం ఆపి.. పని చూసుకో. మీ వల్ల దేశానికి ఏమీ ఉపయోగం లేదు.