నిధులివ్వకుండా కేంద్ర తాత్సారం.

  • నిధులివ్వకుండా కేంద్ర తాత్సారం.
  • అన్ని రాష్ట్రాలు సమానమే అంటారు.
  • కానీ.. న్యాయంగా రావాల్సిన నిధులివ్వరు.
  • కేంద్రం దగ్గర బిచ్చం ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
  • ఇదేనా కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే గౌరవం.

తెలంగాణ ఏర్పాటు దగ్గర నుంచే కేంద్రం ఈ ప్రాంతంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది అనేది వాస్తవం. నీళ్లు, నిధులు, నియామకాలు అన్నింటిలోనూ వివక్షే. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎంపీలు కేంద్రంపై ఎంతో పోరాటం చేస్తే గానీ.. రాష్ట్రానికి కేంద్రం నుంచి ఇప్పుడొస్తున్న అరకొర నిధులు రావడం లేదు. అంటే ఒక రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులకు సైతం రాష్ట్ర నాయకులు కేంద్రంపై పోరాడాల్సిన పరిస్థితి ఉంది. మరి.. అటువంటప్పుడు.. దీనిని వివక్ష, కక్ష సాధింపు అనకుండా ఏమనాలో రాష్ట్ర బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి.

రాష్ట్రంలో ఒక జాతీయ ప్రాజెక్ట్ కు అనుమతిచ్చిందా?. నిధులిచ్చిందా?. పోనీ విభజన చట్టంలోని బయ్యారం ఉక్కు కర్మాగారం. ఖాజీపేట రైల్వే కోచ్ ప్యాక్టరీ, వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు ఏమైనా ఇచ్చిందా?. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన పన్నుల్లో వాటా తప్ప.. కేంద్రం కొత్తగా దేనికి నిధులు ఇచ్చిందో చెప్పండి. రాష్ట్రంలో అమలవుతున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు 25 వేలకోట్లు ఇవ్వాలని చూసింది. ఐదేళ్లు కావొస్తున్నా.. వాటికి 25 పైసలైనా విదిల్చిందా?. ప్రభుత్వం మీద కక్షసాధింపుతో.. పేదల కడుపు కొడుతున్నారు. ఇప్పటికే.. అంగన్ వాడీ, మిడ్ డే మీల్స్ లో కోత పెట్టారు. మోడల్ స్కూల్స్ మొత్తానికే ఎత్తేసినా.. రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. కేంద్రం నుంచి రావాల్సిన సాయంలో ప్రతీసారి తగ్గిస్తూ వస్తున్నా.. రాష్ట్రం భరిస్తూ వస్తోంది. ఇంకా.. ఇంకా కక్ష సాధింపులకు పాల్పడితే.. ప్రజలే మీకు సరైన బుద్ధి చెబుతారు.

తెలంగాణపై ఎటువంటి వివక్ష చూపడం లేదు.. కేంద్రం నుంచి అన్ని విధాలుగా సాయం చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే బీజేపీ నాయకులు, కేంద్రమంత్రులు ఏ పొక్కల పన్నరు. 8 నెలలుగా ఇళ్ల నిధులు ఇవ్వాలని కోరుతున్నా.. పెండింగ్ ఎందుకు పెడుతున్నారు. నీతి ఆయోగ్  మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు నిధులివ్వాలని చెప్పి ఐదేళ్లు అవుతుంది. కానీ.. ఆ పనిచేశారా?. మా సొంత డబ్బుతో ప్రాజెక్టులు కట్టి.. కనీసం నిర్వహణ కోసం అయినా సాయం చేయండని కోరుతున్నాం. ఇందుకు కూడా మీ మనసు కరగడం లేదు. బీజేపీతో ఒరిగేది ఏమీ లేదనే మీ కమలాన్ని తుక్కుతుక్కుగా ఓడిస్తున్నారు ప్రజలు.