వెలుగు పత్రిక.. బి ఆర్ కే ఆర్ భవన్ కు మరమ్మ‌త్తులు కూడా తప్పేనా..?

 

  • వెలుగు పత్రిక.. బి ఆర్ కే ఆర్ భవన్ కు మరమ్మ‌త్తులు కూడా తప్పేనా..?
  • కేంద్ర నిధులతో మరమ్మతులు చేస్తున్నారని ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు..
  •  జర్నలిజం విలువలను మంట కలుపుతూ ఉన్న వెలుగు దినపత్రిక…
  • త్వరలోనే ఆ పత్రికను తరిమి కొట్టడం ఖాయం అంటున్న విశ్లేషకులు…

తెలంగాణ ప్రభుత్వ వ్యతిరేకత ఏకైక ఎజెండాగా ఏర్పడిన వెలుగు దినపత్రిక మళ్ళీ తన కథనాలను ప్రారంభించింది. బూర్గుల రామ కృష్ణ రావు భవన్ ఆధునికీకరణ విషయంలో తన ఏడుపును క‌న‌బ‌రుస్తూ, సుదీర్ఘ వ్యాసాన్ని ప్రచురించింది. ఆ భవనాన్ని ఆధునీకరించడం తప్పు అనే విధంగా మాట్లాడుతూ పేర్కొన్న కథనంపై విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు. అక్కడికేదో కేంద్రం కోట్లకొద్దీ నిధులు ఇస్తుంది కానీ దాన్ని తెలంగాణ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తున్న‌ట్లుగా వెలుగు దినపత్రిక అవాకులు చెవాకులు వెలువారించడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలనకు గుండెకాయ లాంటి సచివాలయం ప్రస్తుతం బి ఆర్ కే ఆర్‌ భవన్ లోనే కొలువై ఉన్న సంగతి తెలిసిందే. నిత్యం ఎంతో మంది సందర్శకుల తాకిడి ఉండే ఈ ఈ భవనానికి ఆధునిక హంగులు కల్పించడం తప్ప అన్ని ఈసందర్భంగా ప్రశ్నిస్తున్నారు. వెలుగు దినపత్రిక వార్తలు చూస్తే కేంద్ర‌ సర్కారు మన రాష్ట్రానికి నిధుల వరద కురిపిస్తుందని, వాటిని ఏం చేసుకోవాలో తెలియక రాష్ట్ర ప్రభుత్వం అల్లాడుతుంది అనే విధంగా వార్తలు రాస్తూ ప్రజల దృష్టిలో చులకన అవుతోంది.

మరోవైపు ప్రధాన మంత్రి సడక్ యోజన గురించి మాట్లాడుతూ వెలుగు దినపత్రిక అవాస్తవాలను ప్రజలకు తెలియజేసే విధంగా ప్రవర్తించడం దారుణమని విశ్లేషకులు మండిపడుతున్నారు. తెలంగాణలో రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబల్ రోడ్డుల‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేక చోట్ల రోడ్లు పూర్తయి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. కావాలనే విషయాన్ని విస్మరించి తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే విధంగా ఆ విధంగా ఉద్దేశపూర్వకంగా కథ‌నాలను  వ‌డ్డిస్తూ,ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వెలుగు దినపత్రిక తన ప్రవర్తన మార్చుకోవాలని లేకపోతే త్వరలోనే భూస్థాపితం అయ్యే అవకాశాలున్నాయని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.