బీజేపీ పాలిత రాష్ట్రాల‌కు మంచి ర్యాంకులు బీజేపీయేత‌ర రాష్ట్రాలైతే త‌క్కువ ర్యాంకులు

 

  • బీజేపీ పాలిత రాష్ట్రాల‌కు మంచి ర్యాంకులు
  • బీజేపీయేత‌ర రాష్ట్రాలైతే త‌క్కువ ర్యాంకులు
  • ఇదీ మోడీ ప్ర‌భుత్వ విధానం
  • ఉన్న‌త విద్య‌లో తెలంగాణ అద్భుత ప్ర‌గ‌తి

ఉన్న‌త విద్య‌లో తెలంగాణ ప‌రిస్థితి బాగాలేదంటూ కేంద్ర హెచ్చార్డీ మంత్రిత్వ‌శాఖ బోగ‌స్ ర్యాంకుల‌ను ప్ర‌క‌టించ‌డం ఎవ్వ‌రికీ ఆశ్చ‌ర్యం క‌లిగించ‌లేదు. అంద‌రూ ఊహించిన‌ట్టే బీజేపీ పాలిత రాష్ట్రాల‌కు మంచి ర్యాంకులు, బీజేపీయేత‌ర రాష్ట్రాల‌కు అధ్వాన‌పు ర్యాంకులు వ‌చ్చాయి. ఉన్న‌త‌విద్య‌ను ముందుకు తీసుకెళ్ల‌డంలో కేసీఆర్ ప్ర‌భుత్వం రాజీప‌డ‌టం లేదు. వేల కోట్ల రూపాయ‌లు ఏటా ఖ‌ర్చు చేస్తున్న‌ది.

అందుకే హైద‌రాబాద్‌లో ట్యాలెంట్ పూల్ ఎక్కువ‌. ఫ‌లితంగా వంద‌ల ఐటీ కంపెనీలు ఇక్క‌డ ఏర్పాట‌య్యాయి. అయినా త‌క్కువ ర్యాంకు రావ‌డం కేవ‌లం రాజ‌కీయ కార‌ణాల వ‌ల్లే! ఈ వార్త‌ను ఆంధ్ర‌జ్యోతి హైలెట్ చేసింది. అభివృద్ధిలో మ‌న రాష్ట్రానిది అగ్రస్థానం.. సంక్షేమ పథకాల్లో నెంబర్‌ వన్‌. జీడీపీ గణాంకాలు, ఐటీ ఎగుమతులు, పారిశ్రామిక ప్రగతి, పేదలకు సంక్షేమ పథకాల అమలు తదితర రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే టాప్‌-5లో ఉంటుంది. ఇంత‌టి ఘ‌న‌మైన రాష్ట్రం ఉన్నత విద్యలో అట్టడుగున ఉంద‌న్న‌ వాద‌న పూర్తిగా స‌త్య‌దూరం.

మ‌న రాష్ట్రంలో విద్యాప‌ర‌మైన మౌలిక స‌దుపాయాలు బాగున్నాయి కాబ‌ట్టే ఎన్నో దేశాల యూనివ‌ర్సిటీలు ఇక్క‌డ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేశాయి. ప్రైవేటు యూనివ‌ర్సిటీల‌కు అయితే లెక్కే లేదు. ఐఎస్‌బీ, బిట్స్ బిలానీ, ఎన్నో బిజినెస్ స్కూళ్ల‌కు నెల‌వు హైద‌రాబాద్‌. మ‌న ఉస్మానియా, కాక‌తీయ యూనివ‌ర్సిటీల్లో వేల మంది విదేశీ విద్యార్థులు చ‌దువుతున్నారు.

ఈ రెండు యూనివ‌ర్సిటీల‌కు అంత‌ర్జాతీయ గుర్తింపులూ ఉన్నాయి. ఈ వాస్త‌వాల‌ను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ(హెచ్‌ఆర్డీ) విస్మ‌రించింది. హరియాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాలు ఉన్నత విద్యలో మనకంటే ఎంతో మెరుగ్గా ఉన్నాయన్న వాద‌న న‌మ్మ‌శ‌క్యంగా లేదు. రాష్ట్రంలో ఉస్మానియా తర్వాత ప్రముఖ యూనివర్సిటీ కాకతీయ. చారిత్రక నగరం వరంగల్‌లో 40 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఈ వర్సిటీ ఇటీవల హెచ్‌ఆర్డీ ప్రకటించిన యూనివర్సిటీల ర్యాంకుల్లో టాప్‌-100లో నిలవలేకపోవ‌డంపై విద్యారంగ నిపుణులు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. దీనికి ఇది వ‌ర‌కే ఎన్నో అక్రిడిటేష‌న్లు ఉన్నాయి. విదేశీ సంస్థ‌లు గుర్తింపులూ ఉన్నాయి. ఈ వర్సిటీ అవసరాలకు ఏటా దాదాపు వంద కోట్ల రూపాయ‌లు ఇస్తున్నారు. వ‌ర్సిటీల్లో ల్యాబ్‌ల‌ను, లైబ్ర‌రీల‌ను అత్యాధునికంగా తీర్చిదిద్దారు. ఈ రెండు యూనివ‌ర్సిటీల్లో సీట్లు దొర‌క‌డాన్ని ఇత‌ర రాష్ట్రాల విద్యార్థ‌లు గ‌ర్వ‌కార‌ణంగా భావిస్తారు. ఒడిశా, హ‌రియాణా వంటి రాష్ట్రాల వాళ్లే చ‌దువుకు, ఉద్యోగాల‌కు ఇక్క‌డ‌కు వ‌స్తారు. అలాంటి రాష్ట్రం ఉన్న‌త‌విద్య‌లో వెనుక‌బ‌డిందంటే చిన్న పిల్ల‌వాడు కూడా న‌మ్మ‌డు.