దక్షిణాదిన బీజేపీ పుంజుకోవడం పెద్ద జోక్.

 

  • దక్షిణాదిన బీజేపీ పుంజుకోవడం పెద్ద జోక్.
  • దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా సొంతంగా అధికారంలోకి రాలేదు బీజేపీ.
  • ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది. కానీ పుంజుకుంటున్నామని..
  • కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ ఫోజులు కొడుతున్నాడు.
  • చట్టసభల్లో అడుగుపెట్టే పరిస్థితే లేదు.. ఏడ పుంజుకుంటున్నారు.

సమాఖ్య స్పూర్తితో ముందుకు వెళ్తున్నాం.. కోవిడ్ 19  చర్యలే ఇందుకు నిదర్శనం అంటున్న బీజేపీ మంత్రులు.. అన్ని రాష్ట్రాలను సమానంగా ఎక్కడ చూస్తున్నారు. కరోనా కష్టం కాలంలోనూ బీజేపీ పిచ్చి రాజకీయాలు చేస్తోంది. వారి పాలిత రాష్ట్రాలకు అధిక నిధులు ఇస్తూ.. బీజేపీయేతర రాష్ట్రాలకు మాత్రం.. తక్కువ నిధులు ఇస్తున్నారు. ఇంకెక్కడ ఉంది సమాఖ్య స్పూర్తి. కరోనా మాటున పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలను బాగు చేసుకుంటూ.. అన్ని సౌకర్యాలు సమకూర్చుకుంటూ మిగతా రాష్ట్రాలకు గాలికి వదిలేస్తున్నారు. తెలంగాణ వెయ్యి వెంటలేటర్లు కావాలని అడిగితే ఇప్పటికీ అతీగతీ లేదు. ఇదేనా సమాఖ్య స్పూర్తి.

బీజేపీ దక్షిణాదిన పుంజుకుంటోందని పగటి కలలు కంటున్న భూపేంద్రయాదవ్.. ముందు నీ భ్రమల నుంచి బయటకురా.. దక్షిణాదిన ఎక్కడా ఇప్పటికీ సొంతంగా అధికారంలోకి రాలేదు మీ బీజేపీ. పక్క పార్టీలను కూల్చి అధికారంలోకి రావడం తప్ప.. దక్షిణాదిన సొంతంగా సీట్లు తెచ్చుకునే దమ్ము బీజేపీకి లేదు రాదు. కేంద్రం ఏం చేసినా చూస్తూ కూర్చోవడానికి దక్షిణాది ప్రజలు వెర్రి వెంగళప్పలు కాదు. సమయం వచ్చినప్పుడు.. ఓటు అనే ఆయుధంతో మీ పిచ్చి చర్యలకు తగిన గుణపాఠం చెప్తారు. అందుకే దక్షిణాదిన మీ హవా కొనసాగదు బీజేపీ నాయకుల్లారా??. సౌత్ పై.. మీరెంత వివక్ష చూపిస్తే.. మీపై కూడా ప్రజలు అంతే వివక్ష చూపిస్తారు.

మీరెన్ని ప్రయత్నాలు చేసినా.. దక్షిణాదిన బీజేపీ పుంజుకోవడం అన్నది అసాధ్యం. సౌత్ స్టేట్స్ లో కేవలం ప్రాంతీయ పార్టీలదే అధికారం. జాతీయ పార్టీలకు దక్షిణాదిన స్థానం లేదు. మీరు ఎలాగూ తమ రాష్ట్రాలను బాగు చేయరు. మా కష్టాన్ని దోచుకుని.. దాచుకోవడం, దేశ కష్టాన్ని కార్పొరేట్లకు దోచి పెట్టడం తప్ప బీజేపీకి ఏమీ చేతకాదు. అందుకే దక్షిణాదిన స్టిల్ ఇప్పటికీ.. చెప్పుకోదగ్గ సీట్లు, స్టేట్స్ లేవు… రావు. ప్రధాని దగ్గర నుంచి కేంద్రమంత్రులు, బీజేపీ ముఖ్య నాయకులంతా వచ్చి తెలంగాణలో ప్రచారం చేసి ఏం సాధించారు. దక్షిణాదికి ఆయువు పట్టు తెలుగు రాష్ట్రాల్లో మీ అడ్రస్ ఎక్కడ అన్నది ఆలోచించండి బీజేపీ నాయకుల్లారా?.